Mon Dec 23 2024 15:32:43 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లిపీటలెక్కనున్న అలియా భట్ - రణబీర్ కపూర్
ఏప్రిల్ రెండో వారంలోనే ఈ జంట పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తొలుత రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో వివాహం..
ముంబై : బాలీవుడ్ ప్రేమ పక్షులు అలియా భట్ - రణబీర్ కపూర్ కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. నిజానికి 2020లోనే వీరి వివాహం జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా చేసుకోలేకపోయామని అలియా ఒకానొక సందర్భంలో తెలిపింది. తాజాగా వీరి పెళ్లి విషయం.. మరోసారి తెరపైకి వచ్చింది. అతి త్వరలోనే అలియా - రణబీర్ పెళ్లితో ఒక్కటవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ రెండో వారంలోనే ఈ జంట పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తొలుత రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో వివాహం చేసుకోవాలనుకున్నారు కానీ.. కొన్ని కారణాల చేత ముంబైలోని చెంబూరులో ఉన్న ఆర్కే నివాసంలో అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో అలియా-రణబీర్ ల వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహ వేడుకపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇటీవలే బిగ్ హిట్ అందుకున్న అలియా.. ప్రస్తుతం రణబీర్ తోనే బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తోంది.
Next Story