Mon Dec 23 2024 16:34:05 GMT+0000 (Coordinated Universal Time)
అలియా - రణబీర్ పెళ్లి డేట్ ఫిక్స్
వీరి సన్నిహితులు ఇచ్చిన సమాచారం మేరకు.. వచ్చేవారం నుంచి పెళ్లి వేడుకలు మొదలవ్వనున్నాయి. ఏప్రిల్ 17న అలియా-రణబీర్ కపూర్ ల
బాలీవుడ్ ప్రేమజంట అలియా భట్ - రణబీర్ కపూర్ లు ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. చాలా కాలంగా ఈ జంట పెళ్లి విషయంపై చాలా పుకార్లు, చర్చలు జరుగుతున్నాయి. 2020లోనే పెళ్లి పీటలెక్కాల్సిన అలియా - రణబీర్ లు.. కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వీరి పెళ్లి తేదీ ఫిక్స్ అయింది.
వీరి సన్నిహితులు ఇచ్చిన సమాచారం మేరకు.. వచ్చేవారం నుంచి పెళ్లి వేడుకలు మొదలవ్వనున్నాయి. ఏప్రిల్ 17న అలియా-రణబీర్ కపూర్ ల పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని ఊహాగానాలు వచ్చినప్పటికీ.. రణబీర్ తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్న చోటే వీరిపెళ్లి జరగనుంది. చెంబూర్ లోని ఆర్కే హౌస్ లో అలియా-రణబీర్ ల వివాహం కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది.
Next Story