Sun Dec 22 2024 04:50:46 GMT+0000 (Coordinated Universal Time)
తల్లి కాబోతున్న ఆర్ఆర్ఆర్ హీరోయిన్
అలియా భట్ మరియు రణబీర్ కపూర్ల 'బిడ్డ' త్వరలోనే రాబోతోంది. అలియా సోమవారం నాడు ఆసుపత్రిలో కలిసి ఉన్న ఫోటోను
భాలీవుడ్ నటి అలియాభట్ రణబీర్ కపూర్ తో చాలా కాలం ప్రేమాయణాన్ని నడిపింది. ప్లే బాయ్ అయిన రణబీర్ తో ఎంతో కాలంగా ప్రేమ, సహజీవనం చేసిన అలియాభట్ ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహం చేసుకుంది. పెళ్లయిన రెండు నెలలకే అలియాభట్ తల్లి కాబోతోందనే వార్త బయటకు వచ్చింది. సోనో గ్రఫీ పరీక్ష చేయించుకుంటున్న ఫొటోను అలియానే స్వయంగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆమె పక్కనే ఉన్న రణబీర్ కపూర్ స్క్రీన్ వైపు చూస్తుండడం ఫొటోలో కనిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్ లో అలియా బిడ్డను ప్రసవించనున్నట్టు తెలుస్తోంది. 'మా బేబీ త్వరలోనే వస్తోంది'అంటూ అలియాభట్ ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది.
అలియా భట్ మరియు రణబీర్ కపూర్ల 'బిడ్డ' త్వరలోనే రాబోతోంది. అలియా సోమవారం నాడు ఆసుపత్రిలో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది, "Our baby ….. coming soon." అంటూ సింహం తమ పిల్లతో ఉన్న ఫోటోను కూడా ఆమె షేర్ చేసింది. బ్రహ్మాస్త్రలో అలియా, రణబీర్లతో కలిసి కనిపించనున్న నటి మౌని రాయ్, వారి ఫోటోపై "ఓం నమః శివాయ్. చాలా సంతోషంగా ఉంది. " అని చెప్పుకొచ్చారు. నటి ప్రియాంక చోప్రా, చిత్రనిర్మాత కరణ్ జోహార్ పలువురు వారికి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు కూడా వారికి శుభాకాంక్షలు చెబుతూ వస్తున్నారు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అలియా, రణబీర్ మొదటిసారిగా తెరపై కలిసి కనిపించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, కింగ్ నాగార్జున కూడా నటించారు. సెప్టెంబర్ 9న సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. అలియా, రణబీర్ కొన్నాళ్లు డేటింగ్ చేశారు. ఏప్రిల్ 2022లో ముంబైలోని వాస్తులో వారి సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
News Summary - Alia Bhatt shares pic with Ranbir Kapoor from hospital
Next Story