Sat Dec 21 2024 11:48:47 GMT+0000 (Coordinated Universal Time)
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా
అప్పటి నుండి ఆలియాకు ఈరోజు డెలివరీ కాబోతోందంటూ.. నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అందరూ ఊహించినట్టుగానే..
ఆలియా భట్- రణబీర్ కపూర్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఈరోజు ఉదయం 7.30 గంటలకు ఆలియా గిర్ గ్రామ్ లోని అంబానీ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఆలియాకు ఈరోజు డెలివరీ కాబోతోందంటూ.. నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అందరూ ఊహించినట్టుగానే.. ఆలియాకు కాన్పు జరిగింది. పండంటి ఆడబిడ్డకు ఆలియా జన్మనిచ్చినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అటు ఆలియా, ఇటు రణబీర్ కుటుంబీకులతో పాటు.. బాలీవుడ్ ఇండస్ట్రీ, అభిమానులు, నెటిజన్లు మొత్తం ఈ దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఏప్రిల్ 14న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లైన రెండు నెలలకే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. మరో విశేషం ఏంటంటే.. ఆలియా ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు కూడా షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలిసింది. వీరిద్దరూ కలిసి నటించి బ్రహ్మాస్త్ర సూపర్ హిట్ అయి.. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ అవుతోంది.
Next Story