అలీ పర్మినెంట్ కాదా?
నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాక జబర్దస్త్ లో ఓ జేడ్జ్ పోస్టు ఖాళీ అవడం.. ఓ వారం.. రోజా ఎలాగోలా నెట్టెయ్యడం జరిగింది. అయితే ముందు నుండి [more]
నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాక జబర్దస్త్ లో ఓ జేడ్జ్ పోస్టు ఖాళీ అవడం.. ఓ వారం.. రోజా ఎలాగోలా నెట్టెయ్యడం జరిగింది. అయితే ముందు నుండి [more]
నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాక జబర్దస్త్ లో ఓ జేడ్జ్ పోస్టు ఖాళీ అవడం.. ఓ వారం.. రోజా ఎలాగోలా నెట్టెయ్యడం జరిగింది. అయితే ముందు నుండి ప్రచారం జరిగినట్టుగా నాగబాబు ప్లేస్ లో ఆయన వెళ్ళిన రెండు వారాలకి అలీ ని రోజా పక్కన జడ్జ్ గా కూర్చోబెట్టారు. అది కూడా ఓన్లీ ఫ్రైడే ఎక్స్ట్రా జబర్దస్త్ కీ. ఇక గురువారం జబర్దస్త్ కి వారానికి ఓ హీరో జడ్జ్ గా సెటిల్ అవుతూన్నాడు. అయితే రోజా జబర్దస్త్ జడ్జ్ గా సోలోగానే మంచి రేటింగ్స్ తెచ్చిపెట్టింది. ఇక అలీ వచ్చాక ఆ రేటింగ్ మరింతగా పెరుగుతుంది అనుకున్నారు. అందుకే నాగబాబు వెళ్లినా జబర్దస్త్ కి ప్రాబ్లెమ్ లేదనుకున్నారు మల్లెమాల టివి.
అయితే నాగబాబు ఉన్నప్పుడు స్కిట్స్ మధ్యలో కమెడియన్స్ ని ఉద్దేశించి చిన్న చిన్న కామెడీ పంచ్ లు వేస్తూ.. మధ్యలో గట్టిగా నవ్వుతూ షో మీద హైప్ పెంచేవాడు. అయితే నాగబాబు ప్లేస్ లోకొచ్చిన అలీ నాగబాబు మాదిరి షో ని ఎంజాయ్ చేయలేకపోవడం, షో మధ్యలో సైలెంట్ గా ఉంటున్నాడట. మరి జబర్దస్త్ కి అలీని పర్మినెంట్ జడ్జ్ గా అనుకున్నారు అంతా. కానీ అలీ వచ్చాక జబర్దస్త్ షో సో సో గా ఉండడంతో.. మల్లెమాల ఫీడ్ బ్యాక్ లో అలీ వలన షో కి పెద్దగా ఉపయోగం లేదని అందుకే ఇప్పుడు మల్లెమాల అలీ స్థానంలో మరో కమెడియన్ ను జడ్జ్ గా తెచ్చేందుకు ఆలోచనలో పడినట్లుగా టాక్.