రణ్‌బీర్ తో పెళ్లి గురించి ఆలియా స్పందన..!
బాలీవుడ్ లో లవ్ బ్రేక్ అప్ లు కామన్. ఏజ్ తో సంబంధం లేకుండా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంటారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ [more]
బాలీవుడ్ లో లవ్ బ్రేక్ అప్ లు కామన్. ఏజ్ తో సంబంధం లేకుండా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంటారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ [more]
బాలీవుడ్ లో లవ్ బ్రేక్ అప్ లు కామన్. ఏజ్ తో సంబంధం లేకుండా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంటారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, అగ్ర కథానాయిక ఆలియా భట్ ల ప్రేమ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. గత కొన్నేళ్ల నుండి వీరు ప్రేమలో ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ పబ్లిక్‌గానే కలిసి తిరుగుతున్నారు. వీరు ఇండైరెక్ట్ గా చాలాసార్లు తాము ప్రేమలో ఉన్నామనే విషయాన్ని చెప్పారు. అయితే త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు మొదలయ్యాయి.
పెళ్లి గురించి ఆలోచించే వయస్సు కాదట
తాజాగా ఈ ప్రేమ వ్యవహారం గురించి, పెళ్లి గురించి ఆలియా స్పందించింది. మీడియాలో తమ పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పింది. పెళ్లి గురించే ఆలోచించే వయసు కూడా నాకు ఇంకా రాలేదని అంటోంది. రణ్‌బీర్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనిపించినపుడు దాని గురించి ఆలోచిస్తా. అప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించను ఓన్లీ సినిమాలపైనే నా ఫోకస్ అంతా పెడతానని ఆలియా భట్ చెప్పింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి.