Mon Dec 23 2024 01:52:14 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఆర్ఆర్ బ్లాస్టింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం
టైటిల్ రిలీజ్ చేయడానికే మూడు భాషల్లో ప్రెస్ మీట్ లు పెట్టిన జక్కన్న.. సినిమా రిలీజ్ ముందు ఎన్ని భాషల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు
తెలుగు సినీ ప్రపంచంలో ప్రస్తుతం పెద్ద హైప్ ఉన్న సినిమా ఏదైనా ఉందా అంటే.. అది ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ సినిమానే. భారీ మల్టీస్టారర్ తో పాన్ ఇండియాలో ది మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సినిమా అదొక్కటే. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు, సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. మన జక్కన్న సినిమా టీజర్లు, ట్రైలర్లతో అంత హైప్ పెంచేశారు మరి. ఈ సినిమాపై బాలీవుడ్ లోనూ భారీ అంచనాలున్నాయి. ఇంకా అంచనాలను పెంచేందుకు మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ తో సిద్ధమవుతున్నారు.టైటిల్ రిలీజ్ చేయడానికే మూడు భాషల్లో ప్రెస్ మీట్ లు పెట్టిన జక్కన్న.. సినిమా రిలీజ్ ముందు ఎన్ని భాషల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తాడోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
చెర్రీ , తారక్ లైవ్ పెర్ఫామెన్స్
అనుకున్న సమయం రానే వచ్చింది. మొదటగా.. బాలీవుడ్ లో బ్లాస్టింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేశారు మేకర్స్. ముంబైలో ఈ ఈవెంట్ జరగనుంది. బ్లాస్టింగ్ ఎపిసోడ్ కు సర్వం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఈ తొలి ప్రమోషన్ ఈవెంట్ ను కని వినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియా యూనిట్ అప్డేట్స్ ఇస్తోంది. భారీ సెట్టింగ్స్ తో గతంలో ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు జరగని విధంగా, బాలీవుడ్ ఆడియన్స్ అభిరుచి మేరకు.. మంచి హంగులతో ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ నెవెర్ బిఫోర్ అనేలా ఉండేందుకు స్వయంగా రాజమౌళి, తారక్, చరణ్ రంగంలోకి దిగి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. అంతేకాదు.. చెర్రీ, తారక్ లు లైవ్ ఫెర్ఫామెన్స్ కూడా ఇస్తారని టాక్. ఈ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరిగింది ? ఎవరెవరు వచ్చారన్న విషయాలు తెలియాలంటే.. సాయంత్రం వరకూ ఆగాల్సిందే.
Next Story