1500 కోట్లు ప్రాజెక్ట్ లో నయనతార
మనకి ‘రామాయణం’ గురించి తెలిసినప్పటికీ దాన్ని సినిమాగా ఇప్పటికి థియేటర్స్ కి వెళ్లే జనాలు ఉన్నారు. ‘రామాయణం’ మీద ఇప్పటికే టాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. [more]
మనకి ‘రామాయణం’ గురించి తెలిసినప్పటికీ దాన్ని సినిమాగా ఇప్పటికి థియేటర్స్ కి వెళ్లే జనాలు ఉన్నారు. ‘రామాయణం’ మీద ఇప్పటికే టాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. [more]
మనకి ‘రామాయణం’ గురించి తెలిసినప్పటికీ దాన్ని సినిమాగా ఇప్పటికి థియేటర్స్ కి వెళ్లే జనాలు ఉన్నారు. ‘రామాయణం’ మీద ఇప్పటికే టాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి వెండితెర పైకి ‘రామాయణం’ రానుంది. కాకపోతే ఈసారి భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ .. మధు మంతెన .. నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ పేరుతో మూడు భాగాలుగా మూడు భాషల్లో నిర్మించనున్నారు.
తెలుగు తో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది. దాదాపు 1500 కోట్లు బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కనుంది. ఇందులో సీత పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్టుగా సమాచారం. సీత పాత్రలో నయన్ గతంలో ‘శ్రీరామరాజ్యం’ లో నటించింది. ఆ పాత్రకు ఆమె జీవం పోసిందనే చెప్పాలి. అందుకే మరోసారి ఈ పెద్ద ప్రాజెక్ట్ లో ఆమెను సీత గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట మేకర్స్.
మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఒకవేళ సీత పాత్ర చేసేందుకు నయన్ ఓకే చెబితే ఆమె పంట పండినట్టే. రాముడు పాత్రలో ఎవరు నటిస్తారు అనేది పెద్ద సస్పెన్స్.