Mon Dec 23 2024 12:10:00 GMT+0000 (Coordinated Universal Time)
'కచ్చా బాదమ్' పాటకి అల్లు అర్హ క్యూట్ స్టెప్స్.. షేర్ చేసిన బన్నీ
చిన్నా, పెద్దా తేడా లేకుండా, మాములు జనాలు, సెలబ్రిటీలు అని తేడా లేకుండా అంతా ఈ పాటకు కాలు కదులుపుతున్నారు. అలా వైరల్
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్.. ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో ఏదైనా కొత్త సాంగ్ వచ్చిందంటే చాలు. క్షణాల్లో రీల్స్ చేసేసి.. ఆ పాటను వైరల్ చేసేస్తుంటారు నెటిజన్లు. కచ్చా బాదం సాంగ్ కి వేసిన స్టెప్, ఆ మ్యూజిక్ కూడా బాగా వైరల్ అవ్వడంతో ఆ సాంగ్ కి అదే స్టెప్పు వేస్తూ అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ నెటిజన్లు అంతా దానికి డ్యాన్స్ చేస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా, మాములు జనాలు, సెలబ్రిటీలు అని తేడా లేకుండా అంతా ఈ పాటకు కాలు కదులుపుతున్నారు. అలా వైరల్ అయిన సాంగే కచ్చా బాదమ్. ఈ బెంగాలీ పాటకు కొన్నివేల మంది రీల్స్ చేశారు.
తాజాగా అల్లుఅర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా ఈ పాటకు స్టెప్స్ వేసింది. అల్లు అర్హ చాలా క్యూట్ గా కచ్చా బాదమ్ స్టెప్స్ వేయగా.. మై లిటిల్ బాదం అర్హ అని ట్యాగ్ తో ఆ వీడియోను బన్నీ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అర్హ క్యూట్ గా డ్యాన్స్ చేయడంతో.. నెటిజన్లు అభినందిస్తూ.. వీడియోను షేర్ చేస్తున్నారు.
Next Story