Sun Dec 22 2024 17:51:06 GMT+0000 (Coordinated Universal Time)
బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా.. ఈ సారి పాన్ ఇండియా
ఈ మూడు సినిమాలను నిర్మించిన హారిక హాసిని క్రియేషన్స్ తో పాటు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా త్రివిక్రమ్ - బన్నీ కాంబోలో..
అల్లు అర్జున్ - త్రివిక్రమ్.. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురములో భారీ విజయాలు అందుకున్నాయి. ఈ హ్యాట్రిక్ హిట్స్ కాంబినేషన్లో నాలుగవ సినిమాను ప్రకటించారు. ఈ మూడు సినిమాలను నిర్మించిన హారిక హాసిని క్రియేషన్స్ తో పాటు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా త్రివిక్రమ్ - బన్నీ కాంబోలో ఈ సారి పాన్ ఇండియా సినిమా రాబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. పుష్ప-2 తర్వాత బన్నీ చేసే సినిమా ఇదే అని సమాచారం. ఇది అల్లుఅర్జున్ 22వ సినిమాగా తెరకెక్కనుంది.
ఈ సినిమా ప్రకటనతో బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ - మహేష్ సినిమా కు ప్లాన్ చేయగా.. అది పూర్తయ్యాకే బన్నీ- త్రివిక్రమ్ ల సినిమా ఉండొచ్చని టాక్. అయితే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు. సంగీతం ఎవరు అందిస్తున్నారు ? హీరోయిన్ కన్ఫర్మ్ అయిందా ? తదితర వివరాలేవీ వెల్లడించలేదు. ఏదేమైనా.. మాటల మాంత్రికుడు - ఐకాన్ స్టార్ కాంబినేషన్లో సినిమా ప్రకటనతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు.
Next Story