అల్లు అర్జున్ అందుకే అక్కడికి వెళ్ళాడు!!
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శత్వంలో పుష్ప సినిమా చెయ్యాలి. అందులోను అది పాన్ ఇండియా మూవీ కావడంతో పుష్ప సినిమాపై అందరిలోనూ అంచనాలు. అలాగే అల్లు [more]
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శత్వంలో పుష్ప సినిమా చెయ్యాలి. అందులోను అది పాన్ ఇండియా మూవీ కావడంతో పుష్ప సినిమాపై అందరిలోనూ అంచనాలు. అలాగే అల్లు [more]
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శత్వంలో పుష్ప సినిమా చెయ్యాలి. అందులోను అది పాన్ ఇండియా మూవీ కావడంతో పుష్ప సినిమాపై అందరిలోనూ అంచనాలు. అలాగే అల్లు అర్జున్ లుక్ పైన కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ కల్డ్ మాస్ లుక్ పుష్ప ఫస్ట్ లుక్ లోనే అదిరింది. లాక్ డౌన్ తో పుష్ప సినిమా పట్టాలెక్కకపోయినా అల్లు అర్జున్ మాత్రం పుష్ప లుక్ లోనే కంటిన్యూ అవుతున్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఆదిలాబాద్ లోని కుంటాల జలపాతాన్ని తన ఫ్యామిలీతో కలిసి సందర్శించాడు. తెలంగాణలో వర్షాలు బాగా పడుతుండడంతో ఆదిలాబాద్ లోను కుంటాల జలపాతం చూడ ముచ్చటగా.. చాల అందంగా.. రమణీయంగా ఉంది. దీంతో ఆ జలపాతం అందాలను అల్లు అర్జున్ తన కుటుంబంతో సందర్శించి హాట్ టాపిక్ అయ్యాడు.
అయితే అల్లు అర్జున్ ఆ కుంటాల జలపాతాన్ని ఊరికే ఆస్వాదించడానికి వెళ్లలేదని.. సుకుమార్ తో తానూ చెయ్యబోయే పుష్ప సినిమాలో ఇలాంటి జలపాతమే కావాలని, గతంలో సుకుమర్ కేరళ లోని ఓ జలపాతం దగ్గర పుష్ప ట్రయిల్ షూట్ నిర్వహించాడు. ప్రస్తుతం కరోనా టైం లో కేరళకి అడవులకి వెళ్లడం సేఫ్ కాదని భావించే అల్లు అర్జున్ అండ్ టీం కుంటాల జలపాతం దగ్గర షూటింగ్ చేస్తే ఎలా ఉంటుందో.. ఆ లొకేషన్ షూటింగ్ కి అనుకూలమా? ప్రతికూలమా? అని చూడడానికే ఆటను ఫ్యామిలీని వెంటేసుకుని ఓ విహార యాత్రల అక్కడికి వెళ్లాడని టాక్ వినిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ ఈ విహార యాత్ర ఎంతగా హైలెట్ అయ్యిందో.. అందులోను అల్లు అర్జున్ లుక్ హైలెట్ అయ్యింది.
- Tags
- allu arjun