Mon Dec 23 2024 09:28:38 GMT+0000 (Coordinated Universal Time)
బన్నీ విత్ హరీష్ శంకర్.. అసలు విషయం ఏమిటంటే..?
దర్శకుడు హరీష్ శంకర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను చేయబోతున్నాడు.
అల్లు అర్జున్ ఒక ప్రకటన కోసం దర్శకుడు హరీష్ శంకర్‌తో చేతులు కలిపాడు. ఇప్పుడు ఈ యాడ్ షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.అల్లు అర్జున్ గ్రే షర్ట్, కార్గో ప్యాంట్లో ఎప్పటిలాగే స్టైలిష్‌గా కనిపిస్తుండగా.. హరీష్ శంకర్ ఆకుపచ్చ టీ-షర్ట్, కార్గో ప్యాంట్లో కనిపించాడు. ఈ ప్రాజెక్ట్ కోసం DOP సుదీప్ ఛటర్జీ పని చేస్తూ ఉన్నారు. షూట్ నుండి BTS వీడియో కూడా ఇంటర్నెట్లో కనిపించింది. 'డీజే' చిత్రం కోసం హరీశ్ దర్శకత్వంలో బన్నీ నటించాడు. ఇప్పుడు ఓ యాడ్ ఫిల్మ్ కోసం కలిశారు. ఈ యాడ్ త్వరలోనే విడుదల కానుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ పలు ప్రకటనల్లో నటించాడు. ఇప్పుడు తొలిసారి హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాణిజ్య ప్రకటనలో నటించాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ థాయ్ లాండ్ లో జరిగినట్టు సమాచారం.
అల్లు అర్జున్ త్వరలో పుష్ప: ది రైజ్ సీక్వెల్ కోసం వర్క్ ను మొదలుపెట్టనున్నాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఈ ఏడాది ఆగస్టు నాటికి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. 6 నెలలకు పైగా సుదీర్ఘ షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. పలు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించబోతున్నారు. 2023లో సినిమాను విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది.
దర్శకుడు హరీష్ శంకర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను చేయబోతున్నాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ డ్రామాకి సంబంధించిన స్క్రిప్ట్‌ను పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశిస్తున్నట్లుగా పూర్తీ చేస్తున్నాడు హరీష్ శంకర్.
News Summary - Allu Arjun collaborates with Harish Shankar for an AD shoot
Next Story