బన్నీ షర్ట్ అంత కాస్ట్లీనా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ అని మనం పిలుస్తున్నాం అంటే దానికితగ్గట్టే మన బన్నీ ఉంటాడు కాబట్టి. ఫ్యాషన్ ప్రపంచంలో ఏ కొత్త ట్రెండ్ వచ్చినా దాన్ని మన టాలీవుడ్ కి పరిచయం చేయడంలో ముందుంటాడు బన్నీ. అతను అలా పరిచయం చేసినవి చాలా ఉన్నాయి. బన్నీని చూసి మన హీరోస్ చాలామంది ఫాలో అవుతుంటాడు. అందుకే అతనికి స్టైలిష్ స్టార్ అని బిరుదు. ఈ బిరుదుని కాపాడుకోటం మాములు విషయం కాదు. ఏ ఫంక్షన్ కి వెళ్లిన అందరి కంటిలో పడేటట్టు డ్రెస్సింగ్ వెయ్యాలి. అందరికన్నా చాలా డిఫరెంట్ గా కనిపించాలి. అందుకే బన్నీ తన స్టయిలిస్టులకి కూడా చేతినిండా పని పెడుతున్నాడు.
లక్షా యాభై వేల బట్టలతో
రీసెంట్ గా జరిగిన 'టాక్సీవాలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ వేసుకొచ్చిన 'గివెంచీ' స్వెట్ షర్ట్ ట్రెండింగ్ టాపిక్ అయింది. ఈ షర్ట్ అక్షరాలా అరవై అయిదు వేలట. ఆ టీషర్ట్ తో పాటు బన్నీ ఆ రోజు వేసిన బూట్లు, కళ్లజోడు వగైరా అన్నీ కలిపి లక్షా యాభై వేలపైనే అట. అంత కాస్ట్లీ కాస్ట్యూమ్స్ తో వచ్చిన బన్నీ కి విజయ్ దేవరకొండ వేసిన డ్రెస్ నచ్చడంతో నాకు కూడా ఇటువంటి డ్రెస్ ఒకటి కావాలి నెక్స్ట్ ఈవెంట్ కి వేసుకొస్తా అని అన్నాడు. 'గివెంచీ' బ్రాండ్ గురించి తెలియని వారికి బన్నీ పరిచయం చేశాడు. ప్రస్తుతం బన్నీ వేసిన ఆ షర్ట్ గురించే చర్చ జరుగుతుంది. అంత పెట్టి మనవాళ్లు కొనలేరు కాబట్టి కొన్ని రోజుల్లో ఎలాగో దాని డూప్ కోఠీ మార్కెట్లోకి వచ్చేస్తుంది. దాన్ని వేసుకుని ఆనంద పడడమే.