Mon Dec 23 2024 13:40:33 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : తిరుమలలో అల్లు అర్హ దాగుడుమూతలు..
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, కూతురు అర్హ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక అక్కడ అర్హ దాగుడుమూతలు..
Allu Arjun : అల్లు అర్జున్ వారసులు అయాన్, అర్హ అల్లరి చేసే కొన్ని క్యూట్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా అర్హకి సంబంధించిన ఒక క్యూట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నేడు డిసెంబర్ 7న అర్హ తన తల్లి అల్లు స్నేహారెడ్డితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. గురువారం ఉదయం ఏడుకొండలవాడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గుడి నుంచి బయటకి వస్తున్న తరుణంలో.. అల్లు స్నేహారెడ్డి, అర్హని ఫోటోలు తీసేందుకు అక్కడున్న భక్తులు మీడియా వ్యక్తులు ప్రయత్నించారు. స్నేహ రెడ్డి కూడా వారికోసం కొన్ని ఫోటోలు ఇచ్చారు. అయితే అర్హ మాత్రం తన మొఖం చూపించకుండా ఫోటోగ్రాఫర్స్ తో ఒక ఆట ఆడుకుంది. స్నేహరెడ్డి వెనకాల దాకుంటూ అమ్మ కొంగుతో తన మొఖాన్ని దాచుకుంటూ ఫోటోగ్రాఫర్స్ హైడ్ అండ్ సిక్ ఆడింది. అర్హ ఆడిన దాగుడుమూతలు అందరికీ ముద్దొస్తున్నాయి.
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నటిస్తున్న పుష్ప 2 షూటింగ్ కి ఇటీవలే కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఈ మూవీలో జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ అమ్మోరు గెటప్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ గెటప్ తో డాన్స్ వేయడంతో పాటు పవర్ ఫుల్ ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్ కూడా చేయనున్నారు. మూవీలో ఈ సీక్వెన్స్ హైలైట్ కావడంతో.. అల్లు అర్జున్ గంటల తరబడి ప్రాక్టీస్ చేశారట. రెస్ట్ లేకుండా ప్రాక్టీస్, వెంటనే షూటింగ్ లో పాల్గొనడంతో అల్లు అర్జున్ కి తీవ్రమైన వెన్ను నొప్పి వచ్చిందట. దీంతో డాక్టర్స్ రెస్ట్ అవసరం అని చెప్పడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.
తాజాగా ఈ సినిమాకి మరో సమస్య కూడా వచ్చి పడింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ అనే పాత్రలో నటించిన జగదీషశ్.. ఒక మహిళ ఆత్మహత్య కేసులో నిందితుడిగా అరెస్టు అయ్యాడు. అతనితో తీయాల్సిన సేల్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయట. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.
Next Story