Tue Dec 24 2024 02:56:35 GMT+0000 (Coordinated Universal Time)
డ్రైవర్ ఇల్లు కట్టుకునేందుకు రూ.15 లక్షలు ఇచ్చిన బన్నీ
తరచూ ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్లకు వెళ్లొస్తుంటారు. ఇటీవల కూడా సౌతాఫ్రికా వెళ్లొచ్చారు బన్నీ. డబ్బుంటే.. అందరూ ఇలాగే..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ గా పాపులర్ అయ్యారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. తరచూ ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్లకు వెళ్లొస్తుంటారు. ఇటీవల కూడా సౌతాఫ్రికా వెళ్లొచ్చారు బన్నీ. డబ్బుంటే.. అందరూ ఇలాగే ఉంటారని చాలా మంది అనుకుంటారు. నిజమే.. కానీ ఉన్న దాంట్లో దానం చేయడం కూడా గొప్ప లక్షణం. ఎవరైనా సాయం కావాలని కోరితే కాదనలేరు బన్నీ. తన వద్ద పనిచేసే సిబ్బందికి ఆయన అన్నివిధాలా అండదండలందిస్తారు.
తాజాగా.. అల్లు అర్జున్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. బోరబండ వాసి మహిపాల్ గత పదేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మహిపాల్ స్వస్థలం వరంగల్. నమ్మకస్తుడు కావడంతో అల్లు అర్జున్ అతడిని తన వ్యక్తిగత డ్రైవర్ గా కొనసాగిస్తున్నారు. మహిపాల్ బోరబండలో సొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ తన డ్రైవర్ కు రూ.15 లక్షలు అందించారు. మహిపాల్ కుటుంబ సభ్యులను కలిసి ఆర్థికసాయం చేసి.. సంతోషంలో ముంచెత్తారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.
Next Story