మోస్ట్ ఎవైటింగ్ పాన్ ఇండియా మూవీ పుష్ప షూటింగ్ లో జాయిన్ అయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
తూర్పుగోదావరి జిల్లా మన్య ప్రాంతం మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్ లో మొదలైన స్టైలిష్ స్టార్ పుష్ప షూటింగ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ [more]
తూర్పుగోదావరి జిల్లా మన్య ప్రాంతం మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్ లో మొదలైన స్టైలిష్ స్టార్ పుష్ప షూటింగ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ [more]
తూర్పుగోదావరి జిల్లా మన్య ప్రాంతం మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్ లో మొదలైన స్టైలిష్ స్టార్ పుష్ప షూటింగ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ పుష్ప. అలా వైకుంటపురంలో మరియు రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్స్ తరువాత అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో చేస్తున్న మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ తో పాటు అటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పుష్ప ఫస్ట్ లుక్ కి ప్రేక్షకులు, అభిమానుల దగ్గర నుంచి అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే, అయితే పుష్ప షూటింగ్ ఎప్పుడు మొదలౌవుతుందా అనే ఉత్కంఠ సైతం అంతటా నెలకొంది. ఈ ఉత్కంఠకి తెరదించుతూ పుష్ప చిత్ర బృందం తమ తొలి షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మన్య ప్రాంతం మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్ లో పుష్ప షూటింగ్ నవంబర్ 10 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ షూట్ షెడ్యూల్ లో పాల్గొనడానికి ఇప్పటికే చిత్ర బృందం మారేడిమిల్లి చేరుకున్నారు, వారితో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా సెట్స్ లో అడుగుపెట్టారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ, టాలీవుడ్ ఫెవరెట్ ప్రొడక్షన్ హౌస్ గా అందరి మన్ననలు అందుకుంటున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా తో కలిసి ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఆర్య, ఆర్య 2 చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ & సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో సినీ వర్గాల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. గతంలో అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. అలాగే బన్నీ & దేవి కాంబినేషన్ లో వచ్చిన బన్నీ, సన్ ఆఫ్ సత్యమూర్తి, డీజే సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. మరోసారి వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మ్యూజిక్ లవర్స్ తో పాటు డాన్స్ లవర్స్ ను కూడా ఆకట్టుకోబోతోంది.
- Tags
- Pushpa Shooting