బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎందుకింత గందరగోళం..!
నా పేరు సూర్యతో ఫ్లాప్ అందుకున్న అల్లు అర్జున్ ఫ్యామిలీతో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు కానీ... మీడియాలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మాత్రం గందరగోళం నడుస్తుంది. ఇప్పటికే విక్రమ్ కుమార్ తో బన్నీ కమిట్ అయ్యాడని.. ఈ ఆగస్టులోనే వారిద్దరి కాంబోలో సినిమా సెట్స్ మీద కెళ్లబోతుందనే వార్త ప్రచారం జరిగింది. ఇక విక్రమ్ కుమార్ చెప్పిన కథలో సెకండ్ హాఫ్ వీక్ గా ఉండడంతో దానికి అల్లు అర్జున్ ఏవో మార్పులు చేర్పులు చెయ్యమన్నాడని.. విక్రమ్ కుమార్ కూడా బన్నీ చెప్పిన మార్పులు చేర్పులు చేస్తూ ఫుల్ స్క్రిప్ట్ తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాడనే టాక్ నడిచింది.
త్రివిక్రమ్ కోసం ఎదురుచూస్తున్నారా..?
మరి కొద్దిరోజుల్లోనే పట్టాలెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ విషయమై ఎక్కడా అధికారికంగా ప్రకటన వచ్చింది లేదు... అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ పై స్పందించింది లేదు. అలాంటిది తాజాగా బన్నీ - విక్రమ్ కుమార్ ప్రాజెక్ట్ సమస్యల్లో పడినట్లుగా ప్రచారం షురూ అయ్యింది. విక్రమ్ కుమార్ సెకండ్ హాఫ్ కథను బన్నీ చెప్పిన విధంగా మార్చలేకపోయాడని.. అందుకే బన్నీ ఈ ప్రాజెక్ట్ ని చెయ్యడం లేదని అంటున్నారు. మరోపక్క ఈ సినిమా క్లైమాక్స్ బాగా వీక్ గా వుండడంతోనే అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ ని ఆపేశాడనే టాక్ మొదలైంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో క్లారిటీ లేదు గాని.. ప్రస్తుతం బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అనేక వార్తలు మీడియాలో వండి వారుస్తున్నారు. మరోపక్క బన్నీ త్రివిక్రమ్ కోసం వెయిట్ చేస్తున్నాడని.. అందుకే విక్రమ్ కుమార్ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పడేసాడని కూడా అంటున్నారు.