చివరికి బన్నీ అతనితోనే...!
మెగా ఫ్యామిలీలో, అటు స్టార్ హీరోలలో చకచకా సినిమాలు చేస్తూ ఉండే అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చేస్తే అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తన కెరీర్ లో ఎన్నడూ కష్టపడని విధంగా ఆ సినిమా కోసం కష్టపడ్డాడు బన్నీ. కానీ ఆ సినిమా అతన్ని నిరాశపరించింది. దాంతో బన్నీ తన తర్వాత సినిమాపై సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు.
డైరెక్టర్లు రెడీగా ఉన్నా...
ఇప్పటికే అయిదారుగురు డైరెక్టర్లు బన్నీకి స్టోరీలు చెప్పినా ఏవీ ఆయనను ఇంప్రెస్స్ చేయలేదంట. అందుకే గ్యాప్ వచ్చినా పర్లేదు అనుకుని మంచి సబ్జెక్టు, మంచి డైరెక్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు బన్నీ. విక్రమ్ కె కుమార్, హరీష్ శంకర్, వి.ఐ ఆనంద్ బన్నీతో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నారు. కానీ బన్నీ మాత్రం విక్రమ్ కె కుమార్ చెప్పిన కథ నచ్చడంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ డైలాగ్ వెర్షన్ తో సహా స్క్రిప్ట్ రెడీ చేశాడు. అయితే బన్నీ అందులో కొన్ని మార్పులు చెప్పగా అవి మార్చే పనిలో ఉన్నాడు విక్రమ్. విక్రమ్ కాన్సెప్ట్స్ చాలా కొత్తగా ఉంటాయని అందుకే బన్నీ విక్రమ్ కి ఛాన్స్ ఇచ్చాడని సమాచారం. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాడు.