బన్నీ మరో సినిమాని ఓకే చేశాడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు. బన్నీ లాస్ట్ మూవీ ‘నా పేరు సూర్య వచ్చి చాల రోజులు అవుతున్న, ఇంతవరకు [more]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు. బన్నీ లాస్ట్ మూవీ ‘నా పేరు సూర్య వచ్చి చాల రోజులు అవుతున్న, ఇంతవరకు [more]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు. బన్నీ లాస్ట్ మూవీ ‘నా పేరు సూర్య వచ్చి చాల రోజులు అవుతున్న, ఇంతవరకు తన నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇవ్వలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన నెక్స్ట్ మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈసినిమా వచ్చే నెల లో సెట్స్ మీదకు వెళ్లనుందట.
ఇది ఇలా ఉండగా బన్నీ మరో సినిమాని కూడా లైన్ లో పెట్టేసాడు. త్రివిక్రమ్ సినిమా తరువాత యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. ప్రభాస్ తో భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’ ను తెరకెక్కిస్తున్న యువ దర్శకుడు సుజీత్ రీసెంట్ గా చెప్పిన ఓ లైన్ కి బన్నీ బాగా కనెక్ట్ అయ్యాడట. స్టోరీ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ డెవలప్ చెయ్యమని బన్నీ సుజిత్ కు సూచించాడట. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది దసరా నుండి వీరి కాంబినేషన్ లో ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం సుజిత్ ‘సాహో’ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది 15న రిలీజ్ అవుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తారట. అందుకు సంబంధించి మైత్రి వారు బన్నీ కి అడ్వాన్సు ఇచ్చారట. ఆల్రెడీ సుజీత్ వద్ద కుడా మైత్రీవారి అడ్వాన్సు ఉందట. సో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీద వెళ్లడం ఖాయం అంటున్నారు