Mon Dec 23 2024 18:53:46 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్, బన్నీ సినిమాల పై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత..
బాలీవుడ్ బడా ప్రొడక్షన్ కంపెనీ టి-సిరీస్ బ్యానర్ లో ప్రభాస్ అండ్ బన్నీ సినిమాలు చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా..
ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్స్ అయ్యిపోయారు. ఈ ఇద్దరితో సినిమాలు చేసేందుకు నార్త్ టు సౌత్ దర్శకనిర్మాతలు తెగ పోటీపడుతున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ బడా ప్రొడక్షన్ కంపెనీ టి-సిరీస్ బ్యానర్ లో వీరిద్దరూ సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ.. ప్రభాస్ అండ్ బన్నీతో విడివిడిగా సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా స్టార్ట్ అవుతుంది అనేది ఒక ప్రశ్నగా మారింది. తాజాగా ఈ విషయం గురించి టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ని ప్రశ్నించడంతో ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఫస్ట్ అనౌన్స్ చేసినట్లు ప్రభాస్ స్పిరిటి (Spirit) ముందుగా మొదలుకానుందట. ఈ చిత్రం పూర్తి అయిన తరువాతే బన్నీ సినిమా పట్టాలు ఎక్కుతుంది అంటూ వెల్లడించాడు. ఇక ఈ న్యూస్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం 'సలార్' రెండు భాగాలు షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అలాగే ఈ చిత్రంతో పాటు 'కల్కి 2898 AD', దర్శకుడి మారుతీ సినిమాని కూడా షూటింగ్ చేస్తూ వస్తున్నాడు. ఈ మూడు చిత్రాల చిత్రీకరణ పూర్తి అయిన తరువాతే 'స్పిరిట్' షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక సందీప్ వంగ కూడా ప్రస్తుతం 'రణబీర్'తో తెరకెక్కిస్తున్న 'యానిమల్' మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు.
ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తరువాత బన్నీ లైనప్ లో సందీప్ వంగ, త్రివిక్రమ్ సినిమాలు ఉన్నాయి. సందీప్ వంగ ముందుగా ప్రభాస్ సినిమా స్టార్ట్ చేస్తాడు కాబట్టి.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ తో మూవీని పట్టాలు ఎక్కించవచ్చు. వీరిద్దరి కలయికలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా.. అన్ని బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
Next Story