Thu Dec 19 2024 13:09:47 GMT+0000 (Coordinated Universal Time)
Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మూవీ టీం..
పుష్ప 2 విడుదల తేదీ పై నెలకున్న సస్పెన్స్ కి మూవీ టీం తెర దించారు.
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'పుష్ప 2'. మొదటి భాగం పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించడంతో సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఆ క్యూరియాసిటీకి తగ్గ రేంజ్ లో పుష్ప 2 కూడా మంచి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. లాంగ్ వీకెండ్ ఉన్న ఆగష్టు 15ని విడుదల తేదికి పుష్ప 2 ఫిక్స్ చేసుకుంది.
అయితే మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, సినిమా ఆ డేట్ కి రిలీజ్ కావడం కష్టమని.. గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఈ రూమర్స్ తో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో మూవీ టీం ఇచ్చే క్లారిటీ కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ విడుదల తేదీ పై నెలకున్న సస్పెన్స్ కి తెర దించారు. మూవీ సెట్స్ లో హీరోయిన్ రష్మిక దర్శకుడు సుకుమార్ ని ఫోటో తీసిన ఓ పిక్ని చిత్ర యూనిట్ షేర్ చేస్తూ.. షూటింగ్ శరవేగంగా జరుగుతుందని, ఆగష్టు 15కే రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు.
ఇక ఈ క్లారిటీతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇది ఇలా ఉంటే, పుష్ప సినిమా రెండు భాగాలుగా కాదు మూడు భాగాలుగా రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ 'పుష్ప ది రైస్'తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సెకండ్ పార్ట్ ని 'ది రూల్' సబ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. మూడో పార్ట్ని 'ది రోర్' సబ్ టైటిల్ తో తెరకెక్కబోతుందట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో అనేది కూడా తెలియాలి.
Next Story