ఇక నుంచి సంక్రాంతి అక్కడే
ఈ సంక్రాంతికి అల్లు అరవింద్ కుటుంబం తన సొంత ఊరు పాలకొల్లుకి వచ్చిన సంగతి తెలిసిందే. పంచారామాల్లో ఒకటైన శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం సందర్శించారు. అలాగే అల్లు [more]
ఈ సంక్రాంతికి అల్లు అరవింద్ కుటుంబం తన సొంత ఊరు పాలకొల్లుకి వచ్చిన సంగతి తెలిసిందే. పంచారామాల్లో ఒకటైన శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం సందర్శించారు. అలాగే అల్లు [more]
ఈ సంక్రాంతికి అల్లు అరవింద్ కుటుంబం తన సొంత ఊరు పాలకొల్లుకి వచ్చిన సంగతి తెలిసిందే. పంచారామాల్లో ఒకటైన శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం సందర్శించారు. అలాగే అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ… తాను మద్రాస్ లో పుట్టి, హైదరాబాద్ లో పెరిగినా ఎవరైనా మీ ఊరేంటి అని అడిగితే పాలకొల్లు అని మాత్రమే చెప్తానన్నారు.
చాలా ఇచ్చింది…..
పెళ్లయ్యాక తన భార్య మీ పాలకొల్లు తీసుకెళ్లవా అని అడిగిందని.. ఈసారి మా ఊరు వెళ్లాలి అనుకుని వచ్చేశానన్నారు. పాలకొల్లు తన తాతయ్యకి, నాన్నకు కొంచెం ఇచ్చిందని, తనకు చాలా ఇచ్చిందన్నారు. అలాంటి తన ఊరుకు ఏమైనా ఇవ్వాలని… అందుకే ఈ సంక్రాంతి నుండి స్టార్ట్ చేస్తున్నానని, పెద్ద గుడిలో కల్యాణ మండపం కట్టిస్తానని పేర్కొన్నారు. ఇందుకు రూ.10 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి ప్రతి సంక్రాంతి ఇక్కడే జరుపుకునేందుకు ప్రయత్నిస్తానన్నారు.