Thu Dec 19 2024 15:02:26 GMT+0000 (Coordinated Universal Time)
పుష్పరాజ్ చిటికెన వేలు గోరు చర్చ..
పుష్ప 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో పుష్పరాజ్ చిటికెన వేలు గోరు గురించి..
అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 (Pushpa 2). ఈ సినిమా గాను రెండు నేషనల్ అవార్డులు కూడా రావడంతో ఇండియా వైడ్ మూవీ పై మరింత ఆసక్తి నెలకుంది. ఇక ఇటీవల ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ తో నెట్టింట ఒక చర్చ మొదలైంది. పోస్టర్ లో అల్లు అర్జున్ పేస్ చూపించకుండా.. తన చేతిని మాత్రమే చూపించారు. ముఖ్యంగా పుష్పరాజ్ చిటికెన వేలు గోరుని చూపించారు.
ఆ చిటికెన వేలు గోరే ఇప్పుడు నెట్టింట చర్చకు దారి తీసింది. గతంలో ఒక టీజర్ ని రిలీజ్ చేయగా.. దానిలో కూడా ఆ చిటికెన వేలు గోరుని చూపించినప్పటికీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. ఆ చిటికెన వేలు గోరు వెనుక కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో అనేక కథలు చెబుతున్నారు. సొసైటీలో తమ స్థాయిని చూపించుకునేందుకు కొన్ని కల్చర్స్ లోని మనుషులు అలా చిటికెన వేలు గోరును పెంచుకుంటారని చెప్పుకొస్తున్నారు. అలా గోరు పెద్దది కలిగి ఉంటే వాళ్ళు డబ్బు ఉన్నవారిని అర్థమట.
ఇక మరికొందరు.. రాజ్యాన్ని పరిపాలించేవాడు అలా గోరు పెంచుకుంటారని, ఎర్రచందనం సిండికేట్ లో పుష్పరాజ్ కింగ్ గా మారతాడు కాబట్టి సుకుమార్ అలా చూపించి ఉండవచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఆ గోరు వెనుక ఉన్న రీజన్ ఏంటో..? సుకుమార్ ఏ ఆలోచనతో అది అలా పెట్టాడో..? తెలియదు గాని, సోషల్ మీడియాలో నెటిజెన్స్ చెప్పే వెర్షన్స్ మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగష్టు 15న రిలీజ్ చేయబోతున్నారు. ఈ విడుదల తేదీతో మూవీకి భారీ ఓపెనింగ్స్ రానున్నాయి. ఎందుకంటే 15 నుంచి మొదలు పెడితే 19 వరకు మొత్తం 5 రోజులు లాంగ్ వీకెండ్ వస్తుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ మూవీకి ఉన్న క్రేజ్ వలన.. 1000 కోట్ల మార్క్ ఈజీగా అందుకుంటుంది అని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.
Next Story