'96' కోసం అల్లు అర్జున్ తిప్పలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా ఓ తమిళ మూవీ చూసి ఫిదా అయ్యాడట. తమిళంలో విజయ్ సేతుపతి - త్రిష జంటగా నటించిన '96' మూవీను రీసెంట్ గా చూసి దీన్ని తెలుగులో ఎట్టిపరిస్థిల్లో రీమేక్ చేయాలనీ చూస్తున్నాడట. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈసినిమా యొక్క తెలుగు రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆల్రెడీ కొనేశారు.
అయితే అల్లు అర్జున్ దిల్ రాజు దగ్గరకు వెళ్లి రీమేక్ రైట్స్ తనకు ఇవ్వమని కోరాడట. అయితే ఎవరుతో రీమేక్ చేయాలనే దానిపై ఇద్దరి దగ్గర సమాధానం లేదట. మన తెలుగులో విజయ్ సేతుపతి లా నలభై కి పైబడి ఎవరు నటిస్తారు? అటువంటి క్యారక్టర్ కి ఎవరైతే కరక్ట్ గా సూట్ అవ్వతారో ఇద్దరికీ అర్ధం కావట్లేదట. మన తెలుగులో కొందరు వున్నా వారికి స్టార్ ఇమేజ్ వుండడం వల్ల వారికి ఈ కథ సూట్ అవదు.
సో ఆలా అది ఇంకా డిస్కషన్స్ లోనే ఉంది. అల్లు అర్జున్ కి ఎప్పటి నుండో నిర్మాణ రంగంలోకి డైరెక్టుగా దిగి తన టేస్ట్‌కి తగ్గ సినిమాలు నిర్మించాలనే ఆలోచన ఉంది. ఒకవేళ ఇది సెట్ అయితే అల్లు అర్జున్ తన బ్యానర్ లో తీసే మొదటి సినిమా ఇదే అయ్యిది. కానీ దిల్ రాజు..బన్నీ మధ్య ఎలాంటి డీల్ అయితే కుదర్లేదు. ఒకవేళ దిల్ రాజు అల్లు అర్జున్ ని కలుపుకుని ఈసినిమాను నిర్మిస్తారేమో చూడాలి. ఒకవేళ అదే జరిగితే ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ వస్తుంది. ఒకవేళ ఎవరు ఇందులో నటించకపోతే అల్లు అర్జునే నటించే అవకాశం ఉంది.