Mon Dec 23 2024 01:58:24 GMT+0000 (Coordinated Universal Time)
Tollywood: ఇన్స్టాగ్రామ్లో టాలీవుడ్ హీరోల హవా.. బన్నీ, విజయ్, చరణ్..
ఇన్స్టాగ్రామ్లో టాలీవుడ్ హీరోల హవా మాములుగా లేదు. ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన టాప్ 5 స్టార్స్ వీరే..
Tollywood : ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల హవా నడుస్తుండడంతో మన హీరోల స్టార్డమ్ ని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఎదుగుతూ వెళ్తుంది. ఈక్రమంలోనే మన హీరోల సోషల్ మీడియా ఫాలోవర్స్ లిస్ట్ కూడా పెరుగుతూ వెళ్తుంది. టాలీవుడ్ ప్రస్తుతం స్టార్ హీరోలుగా రాణిస్తున్న అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్.. ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ ని కలిగి సోషల్ మీడియా స్టార్స్ కూడా అనిపించుకుంటున్నారు.
ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. తన స్టైలింగ్ తో యూత్ లో ఎంతో ఫ్యాన్డమ్ ని సంపాదించుకున్న బన్నీ.. మొదటి నుంచి సోషల్ మీడియాలో హావ చూపిస్తూ వస్తున్నారు. ఇక పుష్ప తరువాత ఆయన రేంజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన ఫాలోవర్స్ కౌంట్ 25 మిలియన్ కి చేరింది. అంటే రెండున్నర కోట్ల మంది అల్లు అర్జున్ ని ఫాలో అవుతున్నారు.
బన్నీ తరువాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఉన్నారు. విజయ్ కూడా అల్లు అర్జున్ లాగానే తన స్టైలింగ్ తో యూత్ ని బాగా ఆకట్టుకుంటూ వచ్చారు. దీంతో ప్రస్తుతం విజయ్ ఫాలోవర్స్ కౌంట్ 21.4 మిలియన్ కి చేరింది. అంటే దాదాపు 2 కోట్ల 14 లక్షల మంది విజయ్ దేవరకొండని ఫాలో అవుతున్నారు.
వీరిద్దరి తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపుని సంపాదించుకున్న రామ్ చరణ్.. ఆ తరువాత సోషల్ మీడియా ఫాలోవర్స్ కౌంట్ లో దూకుడు చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం చరణ్ ని 21.1 మిలియన్ ఫాలోవర్స్, అంటే 2 కోట్ల 11 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
ఇక మహేష్ బాబు తన రీజినల్ స్టార్డమ్తోనే ఇన్స్టాలో అదిరిపోయే ఫాలోయింగ్ ని అందుకున్నారు. 13.3 మిలియన్ ఫాలోవర్స్ తో మహేష్ నాలుగో ప్లేస్ లో ఉన్నారు. అంటే దాదాపు 1 కోటి 33 లక్షల మంది ఫాలో అవుతున్నారన్న మాట.
వీరి తరువాత బాహుబలి స్టార్ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. పాన్ ఇండియా చిత్రాలతో ఎంతో స్టార్డమ్ ని సంపాదించుకున్న ప్రభాస్.. సోషల్ మీడియాలో చాలా ఇన్ యాక్టీవ్ గా ఉంటారు. కానీ అయినాసరి ప్రభాస్ ని 11.7 మిలియన్ ఫాలోవర్స్ అంటే 1 కోటి 17 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన టాప్ 5 స్టార్స్ వీరే. కాగా ఈ గణాంకాల సమాచారం 2024 మార్చి 23 వరకు ఉన్న ఫాలోవర్స్ బట్టి ఇచ్చింది.
Next Story