Mon Dec 23 2024 06:18:53 GMT+0000 (Coordinated Universal Time)
మేడమ్ టుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం..!
మహేష్ బాబు, ప్రభాస్‌ల తరువాత ఇప్పుడు అల్లు అర్జున్ వంతు. మేడమ్ టుస్సాడ్స్‌లో బన్నీ మైనపు విగ్రహం..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ నుంచి ఈ పురస్కారం అందుకున్న మొట్టమొదటి యాక్టర్ గా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. ఇక ఈమధ్య ఇన్స్టాగ్రామ్ సంస్థ అల్లు అర్జున్ పై ఒక స్పెషల్ షార్ట్ డాక్యుమెంటరీ చేసింది. ఇండియాలో ఈ ఘనత అందుకున్న ఫస్ట్ యాక్టర్ గా బన్నీ నిలిచాడు. ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఐకాన్ స్టార్ మైనపు విగ్రహం పెట్టబోతున్నారట.
ఇప్పటికే మన ఇండియన్ స్టార్స్ చాలామందివి అక్కడ మైనపు విగ్రహాలు ఏర్పాటు అయ్యాయి. ఇక సౌత్ నుంచి అయితే.. మహేష్ బాబు, ప్రభాస్ ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆ గౌరవాన్ని అల్లు అర్జున్ కూడా అందుకున్నట్లు సమాచారం. ఈ విగ్రహ ఏర్పాటు కోసం కొలతలు ఇవ్వడానికి అల్లు అర్జున్ త్వరలోనే లండన్ వెళ్లనున్నాడని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అల్లు అర్జున్ టీం నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
బన్నీ అభిమానులు మాత్రం ఈ న్యూస్ తో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. ఒకవేళ ఈ మైనపు విగ్రహాన్ని నిజంగానే ఏర్పాటు చేస్తే.. అల్లు అర్జున్ గెటప్ లోనే పెడతారా..?లేదా పుష్ప రాజ్ గెటప్ లో పెడతారా..? అనే సందేహం నెలకుంది. మహేష్ విగ్రహాన్ని తన రూపంలోనే పెట్టారు. కానీ ప్రభాస్ విగ్రహం మాత్రం బాహుబలి గెటప్ లో ఉన్నది ఏర్పాటు చేశారు. మరి అల్లు అర్జున్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నాడు. పుష్ప రాజ్ గా బన్నీ ఇచ్చిన మ్యానరిజమ్స్, చెప్పిన డైలాగ్స్ వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆడియన్స్ పుష్ప 2 కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని నెక్స్ట్ ఇయర్ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
Next Story