Sun Dec 22 2024 22:21:56 GMT+0000 (Coordinated Universal Time)
సుహాస్ వల్లే ఆహా ఈ స్థాయిలో ఉంది : అల్లు అరవింద్
సుహాస్ హీరోగా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై.. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అయిన ఆహా.. ఇప్పుడు ఏ స్థాయిలో పాపులర్ అయిందో అందరికీ తెలుసు. సినిమాలు, కామెడీ షో, కుకింగ్ షో, సింగింగ్ అండ్ డ్యాన్స్ కాంపిటిషన్లతో పాటు అన్ స్టాపబుల్ లో ప్రముఖుల ఇంటర్వ్యూలతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా బాలయ్య హోస్ట్ గా సాగుతున్న అన్ స్టాపబుల్ ఇండియాలోనే హయ్యెస్ట్ రీచ్ ని సొంతం చేసుకుంటూ.. రికార్డు సృష్టిస్తోంది. అలాంటి ఆహా.. నిలబడటానికి కారణం సుహాస్ అని అంటున్నారు అల్లు అరవింద్.
సుహాస్ హీరోగా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై.. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సుహాస్ వల్లే ఆహా నిలబడిందన్నారు. సుహాస్ హీరోగా తెరకెక్కిన రెండో చిత్రం ఇది. ఇతను హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా కూడా మీమే రిలీజ్ చేశాం.
కోవిడ్ లాక్ డౌన్ లో ప్రారంభమైన ఆహా ఓటీటీలో విడుదలైన "కలర్ ఫొటో" సినిమా ఏ స్థాయిలో హిట్ అందుకుందో తెలిసిందే. సుహాస్ - నందిని చౌదరి జంటగా వచ్చిన ఈ లవ్ స్టోరీ.. ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంది. మా ఆహాకు అదే మొదటి సక్సెస్. ఆ సినిమాకు వచ్చిన ప్రజాధారణ మా ఆహాకు రీచ్ పెరిగేలా చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్గా, విలన్గా, హీరోగా నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు ‘సుహాస్’. రైటర్ పద్మభూషణ్ లో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా నటించగా.. రోహిణి, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రలు పోషించారు.
Next Story