Mon Dec 23 2024 14:45:46 GMT+0000 (Coordinated Universal Time)
Manchu Lakshmi : మంచు లక్ష్మికి అల్లు శిరీష్ ముద్దు.. ఫోటో వైరల్..
మంచు లక్ష్మికి అల్లు శిరీష్ ముద్దు పెట్టిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
Allu Sirish - Manchu Lakshmi : అల్లు వారసుడు శిరీష్, మంచు వారసురాలు శిరీష్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం వారసులు గానే కాకుండా ఇద్దరు పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. అయితే గత కొంత కాలంగా మాత్రం వీరిద్దరూ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మాత్రం సందడి చేస్తూ ఆడియన్స్ కి కనిపిస్తూ వస్తున్నారు.
ఇటీవల చిరంజీవి ఇంట దివాళీ బ్యాష్ జరిగిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన హోస్ట్ చేసిన ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ లోని స్టార్స్ నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా అందరూ ఫ్యామిలీస్ తో సహా వచ్చారు. ఈక్రమంలోనే ఈ దివాళీ సెలబ్రేషన్స్ లో మంచు వారసులు లక్ష్మి, మనోజ్, అల్లు శిరీష్ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలను లక్ష్మి ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ ఫొటోల్లో మంచు లక్ష్మి స్టార్స్ అందరితో కలిసి దిగిన సెల్ఫీలు కనిపిస్తున్నాయి. ఆ సెల్ఫీల్లో ఒక ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒక ఫొటోలో అల్లు శిరీష్, లక్ష్మి బుగ్గ పై ముద్దు పెడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. మంచు లక్ష్మి షేర్ చేసిన ఆ ఫోటోలు వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.
ఇది ఇలా ఉంటే, మంచు లక్ష్మి 'టీచ్ ఫర్ చేంజ్' అంటూ ఒక ట్రస్ట్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ద్వారా పేద పిల్లలకు మెరుగైన విద్య అందిస్తూ వస్తున్నారు. ఈ దివాళీని ఆ పేద ప్రజలతో కలిసి 'టీచ్ ఫర్ చేంజ్' ట్రస్ట్ ద్వారా సంతోషంగా జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా లక్ష్మి షేర్ చేశారు.
Next Story