Mon Dec 23 2024 12:35:31 GMT+0000 (Coordinated Universal Time)
బన్నీకి నేషనల్ అవార్డు వచ్చాక అల్లు స్నేహ రియాక్షన్ ఏంటో తెలుసా..?
బన్నీకి నేషనల్ అవార్డు రావడం పట్ల అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హ రియాక్షన్స్ ఏంటో తెలుసా..? అవార్డు ప్రకటన తరువాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన బన్నీ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డుని అందుకోవడంతో అల్లు ఇంట పండుగా వాతావరణం నెలకుంది. తెలుగులో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న ఫస్ట్ యాక్టర్ బన్నీ కావడంతో కుటుంబ సభ్యులంతా కొంత భావోద్వేగానికి గురవుతున్నారు. అయితే ఈ అవార్డు రావడం పట్ల అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హ రియాక్షన్స్ ఏంటో తెలుసా..?
ఈ అవార్డు ప్రకటన తరువాత బన్నీ తొలిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. ఈక్రమంలోనే అవార్డు అందుకోవడం పై తన భార్య, పిల్లల రియాక్షన్ ఏంటో తెలియజేశాడు. అల్లు స్నేహ రియాక్షన్ చెబుతూ.. "స్నేహ సినిమా కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాదు. కాబట్టి సినిమాలు గురించి అసలు ఏమీ తెలియదు. మూవీ నచ్చితే బాగుందని, నచ్చకపోతే నచ్చలేదని చెబుతుంది. సినిమా విషయంలో నాకు ఎప్పుడు సలహా ఇవ్వదు. నాకు హిట్టు వచ్చినా, ప్లాప్ వచ్చినా ఆమెలో పెద్ద తేడా కనిపించదు. అయితే మా పెళ్ళైన తరువాత సినిమా విషయంలో తను కన్నీళ్లు పెట్టుకొని ఎక్కువ భావోద్వేగానికి గారైన సంఘటన ఏదైనా ఉంది అంటే.. ఇప్పుడు నాకు నేషనల్ అవార్డు ప్రకటించిన సందర్భమే" అంటూ పేర్కొన్నాడు.
అయాన్, అర్హ రియాక్షన్ ఏంటని ప్రశించగా, బదులిస్తూ.. "నాకు ప్రతిసారి కంటే ఈసారి ఏదో పెద్దది వచ్చిందని అయాన్ కి అయితే అర్థమైంది. కానీ అర్హకి మాత్రం ఇవేమి తెలియడం లేదు. కాకపోతే తన తండ్రి ఏదో సాధించాడని మాత్రం అర్ధమైనట్లు తెలుస్తుంది. దీంతో వారిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు" అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే అర్హ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేసింది. అయాన్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని అడగగా బన్నీ బదులిస్తూ.. అయాన్ నటన పై ఆసక్తి చూపిస్తే కచ్చితంగా సినిమాలోకి వస్తాడని చెప్పుకొచ్చాడు. కాగా అర్హ సమంత 'శాకుంతలం' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఎన్టీఆర్ దేవర సినిమాలో కూడా హీరోయిన్ చిన్నప్పటి పాత్రని అర్హతో చేయించాలని దర్శకుడు కొరటాల భావిస్తున్నట్లు సమాచారం.
Next Story