అల్లు ప్లాన్ కాస్ట్లీ అయ్యా?
మెగా కాంపాండ్ నుండి అల్లు గ్రూప్ బయటికి వచ్చినట్లే కనబడుతుంది ప్రస్తుతం అల్లు వారి వ్యవహారం చూస్తుంటే. మెగాస్టార్ చిరు నీడ గా అరవింద్ టాప్ ప్రొడ్యూసర్ [more]
మెగా కాంపాండ్ నుండి అల్లు గ్రూప్ బయటికి వచ్చినట్లే కనబడుతుంది ప్రస్తుతం అల్లు వారి వ్యవహారం చూస్తుంటే. మెగాస్టార్ చిరు నీడ గా అరవింద్ టాప్ ప్రొడ్యూసర్ [more]
మెగా కాంపాండ్ నుండి అల్లు గ్రూప్ బయటికి వచ్చినట్లే కనబడుతుంది ప్రస్తుతం అల్లు వారి వ్యవహారం చూస్తుంటే. మెగాస్టార్ చిరు నీడ గా అరవింద్ టాప్ ప్రొడ్యూసర్ అయినా చిరు వెనకనే ఉండేవాడు. అయితే ఎప్పటినుండో చిరంజీవి వైజాగ్ లో మెగా స్టూడియో కడదామనే ప్లాన్ ఉంది. కానీ కార్యరూపందాల్చడం లేదు. అంతలోనే అల్లు వారి మెగా స్టూడియో కట్టబోతున్నామంటూ అక్టోబర్ 1 న అనౌన్స్ చెయ్యడమే కాదు.. గండిపేటలో అల్లు స్టూడియో వర్క్ మొదలైంది కూడా. గండిపేటలో ఏడెకరాల స్థలంలో అల్లు స్టూడియో రూపుదిద్దుకోబోతుంది. అది కూడా చాలా కాస్ట్లీ గా అంటున్నారు.
అల్లు ఫ్యామిలీ ఏకంగా అల్లు స్టూడియో కోసం 100 కోట్లు పెట్టుబడి పెట్టబోతుందట. అల్లు స్టూడియోస్ హైదరాబాద్ లోనే నెంబర్ వన్ స్టూడియో గా ఉండాలనేది అల్లు వారి ప్లాన్. మరి అన్నదమ్ములు ముగ్గురు తండ్రి తో కలిసి 100 కోట్ల పెట్టుబడితో అల్లు స్టూడియోస్ కి ప్లాన్ చేసారంటే దాని మీద వచ్చే రాబడి దానికి డబుల్ ఉంటుందనే లెక్కలేసి మరీ ఈ స్టూడియో వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారనిపిస్తుంది . ఈ స్టూడియో లో అల్లు వారి సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటుగా చిన్న సినిమాల షూటింగ్స్, అలాగే అల్లు వారి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ఆహా కి సంబందించిన వెబ్ సీరీస్ లు ఇక్కడే తెరకెక్కుతాయని అంటున్నారు. మరి మెగా ఫ్యామిలీ లో చిరు – చరణ్ లు చెయ్యలేని పనులు అల్లు ఫ్యామిలీ చేసేస్తుంది.