Mon Dec 23 2024 11:25:06 GMT+0000 (Coordinated Universal Time)
పవన్కి 'హరిహర వీరమల్లు'పై ఇంటరెస్ట్ లేదు.. నిర్మాత కామెంట్స్..?
పవన్ కళ్యాణ్ కి 'హరిహర వీరమల్లు'పై ఇంటరెస్ట్ లేదా..? నిర్మాత AM రత్నం చేసిన కామెంట్స్ ఏంటి..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మొదటిసారి ఒక యోధుడిగా కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘హరిహరవీరమల్లు’ (Hari Hara Veera Mallu). 17 వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి రియల్ స్టోరీని కథాంశంగా తీసుకోని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది.
అయితే ముందు మొదలు పెట్టిన ఈ మూవీని పూర్తి చేయకుండా, ఆ తరువాత స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ని పవన్ కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. అది మాత్రమే కాదు, మధ్యలో మరికొన్ని చిత్రాలు ఒప్పుకొని కూడా వాటిని పూర్తి చేసేస్తున్నాడు. కానీ వీరమల్లు సంగతి ఏంటనేది మాత్రం చెప్పడం లేదు. దీంతో ఈ మూవీ పై పవన్ కి పెద్దగా ఆసక్తి లేదు, ఆయన ఈ చిత్రాన్ని పక్కన పెట్టేశాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా వీటి గురించి నిర్మాత AM రత్నంని ప్రశ్నించగా, ఆయన చేసిన కామెంట్స్.. "వీరమల్లు ఒక పీరియడ్ మూవీ. దానిని తెరకెక్కించాలంటే ఎన్నో సెట్స్ నిర్మించాలి, గ్రాఫిక్స్, ప్రొడక్షన్ వర్క్ అంటూ చాలా ఉంటాయి. ఇలాంటి పీరియాడిక్ సినిమాని చకచకా చేయలేము. ఈ మూవీ కోసం ఎక్కువ సమయం కేటాయించాలి. ఒక ప్లానింగ్ తో వెళ్ళాలి. కాబట్టి పవన్ ప్రస్తుతం తక్కువ రోజుల్లో అయ్యిపోయే సినిమాలను ముందుగా పూర్తి చేస్తున్నారు. అలాగే రాజకీయం కోసం డబ్బులు సంపాదించడానికి షార్ట్ టైములో అయ్యిపోయే కొన్ని రీమేక్ లు కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. అంతేతప్ప ఇంకేమి లేదు. వీరమల్లు షూటింగ్ ని ఈ ఏడాది లోపు పూర్తి చేసి ఎలక్షన్స్ ముందే మూవీని రిలీజ్ చేస్తాము" అంటూ వెల్లడించారు.
కాగా ఇప్పటికి ఈ మూవీ షూటింగ్ 60 శాతం పూర్తి అయ్యినట్లు నిర్మాత తెలియజేశాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ యాక్టర్స్ బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమజీత్ విర్క్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
Next Story