అమలాపాల్ ఫైర్ అయింది!
తమిళ విలక్ష నటుడు విజయ్ సేతుపతి నెక్స్ట్ చేయబోయే కొత్త సినిమా కోసం మొదట అమలాపాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. మరి ఏమైందో ఏంటో సడన్ [more]
తమిళ విలక్ష నటుడు విజయ్ సేతుపతి నెక్స్ట్ చేయబోయే కొత్త సినిమా కోసం మొదట అమలాపాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. మరి ఏమైందో ఏంటో సడన్ [more]
తమిళ విలక్ష నటుడు విజయ్ సేతుపతి నెక్స్ట్ చేయబోయే కొత్త సినిమా కోసం మొదట అమలాపాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. మరి ఏమైందో ఏంటో సడన్ గా ఆమెను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించారు నిర్మాతలు. ఆమె ప్లేస్ లో యంగ్ బ్యూటీ మేఘా ఆకాశ్‌ను తీసుకున్నారు. కారణాలు ఏవేవో చెప్పారు. అయితే తనను ఈమూవీ నుండి తప్పించడంపై అందాల భామ అమలా పాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిర్మాతల తీరు మారాలి. వారు నా పై చెబుతున్నవన్నీ ఏమి కరెక్ట్ కాదు. తాను ప్రొడక్షన్ ఫ్రెండ్లీగా ఉండబోనని వారు చేసిన వ్యాఖ్యలకు సైతం అమలా పాల్ గట్టిగా సమాధానం ఇచ్చింది. తను ఏ విధంగా నిర్మాతలకు, చిత్ర నిర్మాణ సంస్థలకు సహకరించాననే విషయాన్ని వివరిస్తూ ట్విట్టర్లో లేఖను పోస్ట్ చేసింది. తాను ఈచిత్రం కోసం షాపింగ్ చేస్తున్న టైములో ఈసినిమా నుండి మిమ్మల్ని తప్పిస్తున్నాం అని మెసేజ్ వచ్చిందని ఆమె వివరించింది.
తనను సినిమా నుండి తప్పించినందుకు బాధగా లేదని కాకపోతే నిర్మాతలు వహరించిన తీరు సరిగ్గా లేదని వ్యాఖ్యానించింది. తన కోపం అంత నిర్మాతలు మీదే అని విజయ్ సేతుపతి కాదు అని క్లారిటీ ఇచ్చింది. అతను నటించేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పింది. అయితే అమలాపాల్ లేటెస్ట్ మూవీ అడాయ్ లో బోల్డ్ స్టిల్స్‌పై దుమారం రేగడం వల్లే చిత్ర నిర్మాతలు ఆమెను తప్పించారనే ప్రచారం జరుగుతోంది.