బాలయ్య సినిమాలో ‘ఆమె’?
బాలకృష్ణ – బోయపాటి కాంబోలో ముచ్చటగా మూడో మూవీ తెరకెక్కుతుంది. సింహ, లెజెండ్ మూవీస్ బ్లాక్ బస్టర్స్ అవడంతో.. ఇప్పుడు తెరకెక్కుతున్న మూడో సినిమాపై ఫాన్స్ లోనే [more]
బాలకృష్ణ – బోయపాటి కాంబోలో ముచ్చటగా మూడో మూవీ తెరకెక్కుతుంది. సింహ, లెజెండ్ మూవీస్ బ్లాక్ బస్టర్స్ అవడంతో.. ఇప్పుడు తెరకెక్కుతున్న మూడో సినిమాపై ఫాన్స్ లోనే [more]
బాలకృష్ణ – బోయపాటి కాంబోలో ముచ్చటగా మూడో మూవీ తెరకెక్కుతుంది. సింహ, లెజెండ్ మూవీస్ బ్లాక్ బస్టర్స్ అవడంతో.. ఇప్పుడు తెరకెక్కుతున్న మూడో సినిమాపై ఫాన్స్ లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన బాలయ్య కొత్త మూవీ టీజర్ ఓ రేంజ్ లో పేలింది. అయితే ఈ సినిమా కరోనా కు ముందు కొంతమేర షూటింగ్ చేసుకుంది. కొంత షూటింగ్ జరిగిన బాలకృష్ణ కోసం బోయపాటి ఇంతవరకు హీరోయిన్ ని సెట్ చెయ్యలేదు. బోయపాటి లక్కీ గర్ల్ కేథరిన్ బాలయ్య కి హీరోయిన్ గ బోయపాటి ఎంపిక చేసాడనే న్యూస్ ఉంది. కానీ తాజాగా మరో పేరు ప్రచారం లోకొచ్చింది. అది కూడా బోల్డ్ పాత్రలకు సై అంటున్న ‘ఆమె’ ని బోయపాటి బాలయ్య కోసం తీసుకురాబోతున్నాడట.
తమిళ హీరోయిన్ అమల పాల్ ఈమధ్యన ప్రేమ, పెళ్లి వ్యవహారాలతో బాగా హైలెట్ అయినా.. సినిమాల్తో మాత్రం బాగా బిజీ. ఆమె సినిమాలో బోల్డ్ గా నటించిన అమల పాల్ బాలయ్య పక్కన అయితే బావుంటుంది అని బోయపాటి అనుకుంటున్నాడట. ప్రస్తుతం కరోనా కారణంగా ఆమెని నేరుగా కలవలేకపోయినా.. ఫోన్ లోనే సంప్రదిద్దామని బోయపాటి తన టీం తో చెప్పాడట. అయితే కరోనా లాక్ డౌన్ ముగిసి షూటింగ్స్ ప్రారంభమవుతున్నా బాలయ్య మాత్రం ఇంకా సిద్దమగా లేదట. కరోనా తగ్గాకే షూటింగ్ కి వెళదామని బోయపాటికి చెప్పాడట. బోయపాటి మాత్రం బాలయ్య ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకొస్తాడా.. ఎప్పుడెప్పుడు సినిమాని ఫినిష్ చేద్దామా అనే అతృతతో ఉన్నాడట.