Mon Dec 23 2024 18:48:04 GMT+0000 (Coordinated Universal Time)
రెండో పెళ్ళికి బాయ్‌ఫ్రెండ్ ప్రపోజల్.. లిప్‌కిస్‌తో ఓకే చేసిన అమలా..
రెండో పెళ్ళికి బాయ్‌ఫ్రెండ్ ప్రపోజల్. ఆ ప్రొపోజల్ ని అమలా పాల్ ఒకే చేస్తూ.. లిప్‌కిస్ తో బదులిచ్చింది.
హీరోయిన్ అమలా పాల్ నాగచైతన్య సినిమాతో ఆడియన్స్ కి పరిచయమైంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో కూడా కలిసి నటించింది. ప్రస్తుతం తమిళ, మలయాళంలో ఎక్కువ నటిస్తూ వస్తుంది. ఇక అమలా పాల్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. పెళ్లి, ప్రేమ విషయాలతో బాగా వైరల్ అవుతుంటుంది. ఆల్రెడీ ఒక పెళ్లి బ్రేకప్ చేసుకున్న అమలా పాల్.. ఇప్పుడు రెండో పెళ్ళికి సిద్ధమైంది. అమలా 32వ పుట్టినరోజు సందర్భంగా ఆమె బాయ్ ఫ్రెండ్ పెళ్ళికి ప్రపోజల్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
2014లో తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలా పాల్.. విభేదాలతో మూడేళ్ళలోనే విడాకులు తీసుకొంది. 2017 లో వీరిద్దరూ చట్టపరంగా విడిపోయారు. ఆ తరువాత సింగర్ భవీందర్ సింగ్ తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేసిన అమలా పాల్.. అతడితో సహజీవనం చేస్తుందని, పెళ్లి కూడా చేసుకుందని అప్పటిలో వార్తలు వచ్చాయి. అయితే అతడితో కూడా అమలా పాల్ కి విబేధాలు తలెత్తాయి. అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. ఈ రెండు విషయాలతో 2017 నుంచి అమలా పాల్ పర్సనల్ లైఫ్ హాట్ టాపిక్ గానే ఉన్నాయి.
ఇక కొన్నాళ్ల నుంచి 'జగత్ దేశాయ్' అనే వ్యక్తితో సన్నిహితంగా కనిపిస్తూ వైరల్ అవుతుంది. ఇతడు గుజరాత్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త అని సమాచారం. తాజాగా జగత్ దేశాయ్.. ఒక హోటల్ లో చిన్న ఫ్లాష్ మాబ్ ప్లాన్ చేసి అమలా పాల్ కి సర్ప్రైజ్ ప్రపోజల్ పెట్టాడు. ఇక ఆ ప్రొపోజల్ ని అమలా పాల్ ఒకే చేస్తూ.. లిప్‌కిస్ తో బదులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోని జగత్ దేశాయ్ షేర్ చేస్తూ.. క్వీన్ ఒకే చెప్పింది అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Next Story