సీక్రెట్ లేదు ఏమి లేదు.. అంతా ట్రాష్?
హీరోయిన్ అమల పాల్ తమిళ దర్శకుడితో ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ ఎంత సంచలనం చేసిందో.. ఇప్పుడు తాజాగా తన రెండో పెళ్లి విషయాన్నీ అంతే సంచలనం [more]
హీరోయిన్ అమల పాల్ తమిళ దర్శకుడితో ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ ఎంత సంచలనం చేసిందో.. ఇప్పుడు తాజాగా తన రెండో పెళ్లి విషయాన్నీ అంతే సంచలనం [more]
హీరోయిన్ అమల పాల్ తమిళ దర్శకుడితో ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ ఎంత సంచలనం చేసిందో.. ఇప్పుడు తాజాగా తన రెండో పెళ్లి విషయాన్నీ అంతే సంచలనం చేసింది. గాయకుడూ భవిందర్ సింగ్ తో చెట్టాపట్టాలేసుకుని గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్న అమల పాల్.. అతనితో విహార యాత్రలు చేస్తూ డేటింగ్ చేస్తుంది అనే న్యూస్ వచ్చిన నెలలోనే అమల పాల్ భవిందర్ సింగ్ ని సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది అని.. అమల పాల్ – భవిందర్ సింగ్ పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అమల పాల్, భవిందర్ సింగ్ కి లిప్ కిస్ ఇవ్వడం, అలాగే సంప్రదాయంగా అమల పెళ్లి దుస్తుల్లో కనిపించడం అన్ని వెరసి అమల పాల్ రెండో పెళ్లి అంటూ ప్రచారం జరిగింది.
ఇంత జరిగినా అమల పాల్ మాత్రం తన సీక్రెట్ పెళ్లి గురించి మాత్రం ఎక్కడా చెప్పలేదు. అయితే భవిందర్ సింగ్ మాత్రం అమల పాల్ తో దిగిన మ్యారేజ్ హాటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినవెంటనే డిలేట్ చేసినా.. అవి అవ్వాల్సిన వైరల్ అంతా అయ్యాయి. కానీ తాజాగా అమల పాల్ తన సెకండ్ మ్యారేజ్ గురించిన న్యూస్ పై స్పందించింది. తన మేనేజర్ చేత ఇలా చెప్పింది. అమల పాల్ తనకు పార్టనర్ షిప్ ఉన్న కంపెనీ యాడ్ కోసం చేసిన ఫోటో షూట్ అని.. తాను ఎవరికీ చెప్పకుండా ఎందుకు సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంటా అని.. అసలు నేను గనక నిజంగా పెళ్లి చేసుకుంటే.. డిజైనర్ బట్టలు కట్టుకోకుండా పెళ్లి ఎలా చేసుకుంటా అంటూ ఎదురు కొచ్చన్ వేస్తుంది. కానీ అమల పాల్ సెకండ్ మ్యారేజ్ గురించి ఎంతగా కాదని చెప్పిన జనాలు మాత్రం నమ్మడం లేదు.