Fri Dec 20 2024 13:50:54 GMT+0000 (Coordinated Universal Time)
పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వేధిస్తున్నారు.. అమర్ దీప్ తల్లి ఆవేదన..
పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తమని వేధిస్తున్నారు అంటూ అమర్ దీప్ తల్లి ఒక వీడియో రిలీజ్ చేశారు.
తెలుగు బిగ్బాస్ సీజన్ 7 ఆరు వారాలు పూర్తి చేసేసుకొని ఏడో వారంలోకి అడుగుపెట్టింది. గత వరం ఎలిమినేషన్ తో నయని పావని బయటకి వచ్చేయగా.. ఇప్పుడు హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక హౌస్ లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్స్ మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. ఈక్రమంలోనే అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య ఎప్పటినుంచో కోల్డ్ వార్ జరుగుతూ వస్తుంది. అయితే ఈ గొడవలు బిగ్బాస్ హౌస్ నుంచి బయటకి కూడా వస్తున్నాయి.
హౌస్ లోని కంటెస్టెంట్స్ ఆట తీరు చూసి ప్రేక్షకులు ఒక్కో కంటెస్టెంట్ కి అభిమానులు అవుతుంటారు. అయితే వీరిలో కొంతమంది ఫ్యాన్స్ తమ పిచ్చి ప్రేమని చూపించి ఇతరులను బాధ పెడుతున్నారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ కొంతమంది అమర్ దీప్ ఫ్యామిలీ మెంబర్స్ పై సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అమర్ దీప్ తల్లి ఒక వీడియో రిలీజ్ చేసి తెలియజేశారు.
పల్లవి ప్రశాంత్ అభిమానులు అని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు తమ ఫ్యామిలీలోని ఆడవారి పై అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారని అమర్ దీప్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానం ఉంటే మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించుకోవాలి గాని ఇలా ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ని టార్గెట్ చేసి అసహ్యంగా కామెంట్స్ చేయడం ఏమి సంస్కారం అని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని నాగార్జున దృష్టికి తీసుకు వెళ్తాను అంటూ కూడా ఆమె తెలియజేసింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ కామెంట్స్ చేస్తున్నది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ హౌస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. ప్రతి వారం ఎలిమినేషన్ లో నిలుస్తూ వస్తున్నా.. ఇంకా హౌస్ లో బలమైన ప్లేయర్స్ గా ముందుకు సాగుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చూస్తుంటే ఈ వీక్ కూడా వీరిద్దరూ నామినేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తుంది.
Next Story