Mon Dec 23 2024 04:59:46 GMT+0000 (Coordinated Universal Time)
మహాన్ ట్రైలర్.. అదరగొట్టిన తండ్రి - కొడుకు !
ట్రైలర్ లో తండ్రి - కొడుకు అదరగొట్టారు. ఎవరి క్యారెక్టర్ లో వారు నటించారనే కంటే.. జీవించారని చెప్పాలి. విక్రమ్ సినిమా
ప్రముఖ కోలీవుడ్ నటుడు విక్రమ్.. ఆయన కొడుకు ధృవ్ విక్రమ్ కలిసి నటించిన సినిమా మహాన్. ఈ సినిమాలో సీనియర్ నటి సిమ్రన్ విక్రమ్ భార్యగా నటించగా.. సింహా, సనంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీర్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మహాన్ సినిమా.. ఈ నెల 10వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ట్రైలర్ ను విడుదల చేసింది అమెజాన్ ప్రైమ్.
Also Read : బీజేపీ తీరుపై గుంటూరు వైసీపీ నేతల ఆగ్రహం
ట్రైలర్ లో తండ్రి - కొడుకు అదరగొట్టారు. ఎవరి క్యారెక్టర్ లో వారు నటించారనే కంటే.. జీవించారని చెప్పాలి. విక్రమ్ సినిమా అంటే.. ప్రేక్షకులు మాస్ ఎలిమెంట్స్ కోసం వేచిచూస్తుంటారు. ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ను బట్టి చూస్తే.. మద్య నిషేధ పోరాటం చుట్టూ తిరిగే కథగా సినిమా ఉంటుందని తెలుస్తోంది. మద్యనిషేధ ఉద్యమ వీరుడి తనయుడైన విక్రమ్.. అదే మద్యాన్ని గ్రామ ప్రజలకు దొంగచాటుగా సరఫరా చేస్తుంటాడు. విక్రమ్ వృత్తి రీత్యా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. గౌరవ వృత్తిలో ఉన్న విక్రమ్ మద్యం అక్రమ విక్రయాలకు ఎందుకు పాల్పడ్డాడు ? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Next Story