Fri Dec 20 2024 19:41:52 GMT+0000 (Coordinated Universal Time)
Amitabh Bachchan : 50కోట్ల బంగ్లాని ఆమెకు బహుమతిగా ఇచ్చేసిన అమితాబ్..
50కోట్ల బంగ్లాని ఆమెకు బహుమతిగా ఇచ్చేసిన అమితాబ్ బచ్చన్. ఇంతకీ ఎవరు ఆమె..?
Amitabh Bachchan : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి తన నటనతో ఆడియన్స్ ని అలరిస్తూనే వస్తున్నారు. ఎనిమిది పదుల వయసు దాటినా కూడా ఇంకా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ, టీవీ షోలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, రీసెంట్ గా అమితాబ్ 50కోట్ల విలువ చేసే తన బంగ్లాని ఒకరికి బహుమతిగా ఇచ్చేశారట.
అమితాబ్ ఉంటున్న బంగ్లా కాకుండా ఆయనకు ప్రతీక్ష, జనక్, వత్సా, జల్సా బంగ్లాలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రతీక్ష బంగ్లా అమితాబ్ కొనుగోలు చేసుకున్న మొట్టమొదటి ఇల్లు అని సమాచారం. ముంబయి జుహులో ఉన్న ఈ బంగ్లాలో అమితాబ్ తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవారట. ఈ బంగ్లాకి ప్రతీక్ష అనే పేరుని అమితాబ్ దంపతులు కలిసి పెట్టారట. ఈ బంగ్లా విలువ వచ్చి అక్షరాలా రూ.50.63 కోట్ల విలువ ఉంటుందని చెబుతున్నారు.
ఇంతటి విలువైన బంగ్లాని అమితాబ్ ఎవరికి బహుమతిగా ఇచ్చారని ఆలోచిస్తున్నారా..? అమితాబ్ కి అభిషేక్ బచ్చన్ తో పాటు శ్వేత నందా అనే కూతురు కూడా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు బంగ్లాని ఆమెకే బహుమతిగా ఇచ్చేశారట. నవంబర్ 9న ఈ బంగ్లాని అమితాబ్ తన కూతురి పేరు మీదకి బదిలీ చేశారట. ఈ బదిలీలో స్టాంప్ డ్యూటీకే సుమారు రూ.50.65 లక్షలు ఖర్చు అయ్యినట్లు బి-టౌన్ లో చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా బంగ్లా విలువ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా ప్రస్తుతం అమితాబ్ ఆస్తుల విలువ 3000 కోట్లకు పైగా ఉందని చెబుతున్నారు. ఇలాంటి లగ్జరీ బంగ్లాలతో పాటు లగ్జరీ కారులు పలు బిజినెస్ లు కూడా అమితాబ్ కలిగి ఉన్నారు.
Next Story