Fri Dec 20 2024 20:28:18 GMT+0000 (Coordinated Universal Time)
అమితాబ్ ‘అశ్వద్ధామ’గా కనిపించబోతున్నాడా..? శ్రీకృష్ణుడు చేతులో..!
ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 AD' సినిమాలో అమితాబ్ ‘అశ్వద్ధామ’ పాత్ర చేస్తున్నాడా..? ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు..
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 AD' మూవీ స్టోరీ.. కలియుగాంతంలో మోడరన్ టెక్నాలజీ మధ్య జరగనుంది. ఈక్రమంలోనే ప్రభాస్.. విష్ణుమూర్తి 10వ అవతారం కల్కిగా, మోడరన్ విష్ణుమూర్తిగా కనిపించబోతున్నాడు అంటూ నిర్మాత అశ్వినీ దత్ ఇప్పటికే తెలియజేశాడు. కాగా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. నేడు అమితాబ్ బర్త్ డే కావడంతో.. సినిమాలోని లుక్ ని రిలీజ్ చేశారు.
ఆ లుక్ చూస్తుంటే.. అమితాబ్ ఈ సినిమాలో ‘అశ్వద్ధామ’ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తుంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేత అశ్వద్ధామ శపించబడతాడు. ప్రపంచం అంతమయ్యే వరకు అశ్వద్ధామ.. తనకి ఉన్న గాయాలతో రక్తం, చీము కారుతూ, నిత్యం రగులుతూ బ్రతికే ఉండాలని శపిస్తాడు. ఈ శాపంతో అశ్వద్ధామ ఇప్పటికి బ్రతికే ఉన్నాడని, గాయాలు నుంచి శ్రవించే రక్తం కనిపించకుండా ఒంటి నిండా బట్ట చుట్టుకొని ఉంటాడని సనాతన ధర్మ గురువులు చెబుతుంటారు.
కల్కి మూవీ నుంచి గతంలో రిలీజ్ చేసిన టీజర్లో, ఇప్పుడు రిలీజ్ చేసిన ఫొటోలో అమితాబ్.. ఒంటి నిండా బట్ట చుట్టుకొని కనిపిస్తున్నాడు. అలాగే హిందూ ధర్మంలో ఇంకో విషయం కూడా ఉందని.. కలియుగాంతంలో అశ్వద్ధామ కల్కికి సహాయం చేస్తాడని, ఈక్రమంలోనే ప్రభాస్ కి అమితాబ్ సహాయ పడబోతున్నాడని చెబుతున్నారు. మొత్తం మీద.. అమితాబ్ అశ్వద్ధామ పాత్రనే చేస్తున్నాడని నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు.
మరి అమితాబ్ ఏ పాత్ర చేస్తున్నాడో అనేది మూవీ టీం నుంచి క్లారిటీ రావాలి, లేదా ప్రేక్షకులే సినిమా చూసి తెలుసుకోవాలి. కాగా ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా చేస్తున్నాడు. దీపికా పదుకొనే హీరోయిన్ గా చేస్తుంటే దిశా పటాని ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సి అశ్వినీ దత్.. వైజయంతి మూవీస్ పతాకం పై దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
Next Story