Fri Dec 20 2024 19:32:18 GMT+0000 (Coordinated Universal Time)
Amitabh : అమితాబ్ని పొట్ట పగిలేలా నవ్వించిన మహిళ.. వీడియో చూస్తే మీరు నవ్వుతారు..
ఒక మహిళ తన అమాయకమైన చలాకీ మాటలతో అమితాబ్ ని పొట్ట పగిలేలా నవ్వించింది. దేవుడా ఏం అమ్మాయిరా అంటూ బిగ్ బి..
Amitabh Bachchan : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎనిమిది పదుల వయసు దాటినా.. ఇంకా నటిస్తూనే ఉన్నారు. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే టీవీ షోలతో కూడా అలరిస్తూ వస్తున్నారు. బిగ్ బి హిందీ బుల్లితెర పై 'కౌన్ బనేగా కరోడ్పతి' రియాలిటీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షో సీజన్ 15 జరుగుతుంది. ఈ షో మూడవ సీజన్ తప్ప అన్ని సీజన్స్ కి అమితాబ్ హోస్ట్ గా చేస్తూ వచ్చారు. ఇక రీసెంట్ గా జరిగిన ఒక ఎపిసోడ్ లో అమితాబ్ ని ఒక మహిళ కంటెస్టెంట్ పొట్ట పగిలేలా నవ్వించింది.
కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 15కి 'అలోలిక' అనే మహిళ కంటెస్టెంట్ గా వచ్చింది. హాట్ సీట్ లో కూర్చున్న అలోలిక మాట్లాడుతూ.. సర్ నేను ఈ షోకి సెలెక్ట్ అవ్వడం వలన జీవితంలో మొదటిసారి విమానం ఎక్కాను. మేమంతా ప్రయాణం చేయాలంటే ట్రైన్ ఎక్కుతాము. ట్రైన్ లో మా లగేజీ మేము కూర్చునే సీట్ కింద పెట్టుకొని గంటకి ఒకసారి ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటాము. కానీ విమానంలో వల్లే మా లగేజీ పైన పెడుతున్నారు, భద్రంగా ఉంచుతున్నారు అని నవ్వుతూ అమాయకత్వంగా అలోలిక చెప్పిన తీరు అందర్నీ నవ్వించింది.
అలాగే ముంబైలో తను బస చేసిన హోటల్ కూడా చాలా పెద్దదని, తన భర్త కూడా ఆ హోటల్ లో ఉండాలంటే ఖర్చు పెట్టలేరని చెప్పుకొచ్చింది. ఇంత చలాకీగా మాట్లాడుతున్న ఈమెని చూసి అమితాబ్ ఇంటిలో అత్తమామలతో కూడా ఇలానే ఉంటావా అని ప్రశ్నించారు. దానికి ఆమె బదులిస్తూ.. ఆరోగ్యాంగా ఉండడానికి అందరూ డబ్బులు ఇచ్చి జిమ్ కి వెళ్తుంటారు. కానీ నేను ఫ్రీగా మా ఇంటిలో మూడుపూటలా దాల్ చావల్, చేపలు తింటూ ఆరోగ్యంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.
అమాయకంగా, చలాకీగా మాట్లాడుతున్న అలోలిక మాటలకి అమితాబ్.. దేవుడా ఏం అమ్మాయిరా అంటూ కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధిచించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వగా, అమితాబ్ కూడా దానిని రీ ట్వీట్ చేశారు. మరి ఆ వీడియోని మీరు కూడా చూసి నవ్వుకోండి.
Next Story