Mon Dec 23 2024 02:02:08 GMT+0000 (Coordinated Universal Time)
NTR31 : ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమాలో విలన్గా అమితాబ్..!
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కే NTR31లో అమితాబ్ బచ్చన్ ని విలన్ గా చేయబోతున్నారా..?
NTR : మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ లైనప్ లో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దేవర రెండు పార్టులు, హృతిక్ రోషన్తో వార్ 2, ప్రశాంత్ నీల్తో NTR31 సినిమాలు లైన్ లో ఉన్నాయి. ప్రస్తుతం 'దేవర' షూటింగ్ లో తారక్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న వార్ 2 సెట్స్ లోకి 2024లో అడుగు పెట్టనున్నారు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే 31వ మూవీ వచ్చే ఏడాది చివరిలో, లేదా 2025లో పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. "నేను మరణించే లోపు అమితాబ్ బచ్చన్ తో ఒక మూవీ చేయాలి. ఆయనని నా సినిమాలో గ్రేట్ విలన్ గా చుపించాలనేది నా డ్రీం" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ కామెంట్స్కి NTR31కి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా..?
ఎన్టీఆర్తో తెరకెక్కించేబోయే సినిమా తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ ప్రశాంత్ నీల్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమితాబ్ ని విలన్ గా చూపించడం తన డ్రీం అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు.. NTR31లో అమితాబ్ బచ్చన్ ని విలన్ గా చూపించండి అంటూ రిక్వెస్ట్ లు చేస్తున్నారు. కొంతమంది అయితే అమితాబ్ విలన్ గా ఫిక్స్ అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. దీంతో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమాలో అమితాబ్ విలన్ అనే వార్త వైరల్ అవుతుంది. మరి ప్రశాంత్ నీల్ నిజంగా అమితాబ్ ని ఎన్టీఆర్ కి విలన్ గా చూపిస్తారా లేదా అనేది చూడాలి.
Next Story