Tue Apr 01 2025 17:52:56 GMT+0000 (Coordinated Universal Time)
సోనూ సూద్ కు అరెస్ట్ వారెంట్
ప్రముఖ నటుడు సోనూ సూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పంజాబ్ లోని లూథియానా కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రముఖ నటుడు సోనూ సూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పంజాబ్ లోని లూథియానా కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రానందుకు సోనూ సూద్ కు ఈ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ముంబయిలోని అందేరి వెస్ట్ లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్ కు లూసియానా రమన్ ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు. సోనూ సూద్ ను అరెస్ట్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
మోసం కేసులో...
వివరాల్లోకి వెళితే... లూథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ పది లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. తనతో పెట్టుబడి పెట్టించినట్లు తెలిపారు. అయితే ఈ కేసులో సోనూ సూద్ ను సాక్షిగా పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు సోనూ సూద్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే అనేక సార్లు సమన్లు పంపినా హాజరు కాకపోవడంతో వెంటనే సోనూ సూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశారు.
Next Story