Mon Dec 23 2024 06:43:13 GMT+0000 (Coordinated Universal Time)
బేబీ సినిమాను చూసొచ్చిన వాళ్లు ఏమంటున్నారంటే?
ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్.. ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్
ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్.. ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ పాటలు, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘బేబీ’ సినిమా జులై 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అంతకు ముందు రోజు రాత్రి ప్రివ్యూ వేశారు. ‘బేబి’ సినిమా ప్రీమియర్ కోసం విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నాతో కలిసి ఐమ్యాక్స్కి వచ్చారు. ఈ సినిమా ప్రీమియర్స్ను ఐమ్యాక్స్లో ప్రత్యేకంగా వేశారు. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకుంటూ ఉన్నారు. అతడు చేసిన మరో సినిమానే 'బేబీ'.
ప్రీమియర్స్ చూసిన వాళ్లు సినిమా హార్ట్ టచింగ్ అంటూ పొగిడేస్తూ ఉన్నారు. సినిమా ట్రైలర్ లోనే కథ మొత్తం రివీల్ చేశారు. స్కూల్ లైఫ్ లో కలసి చదువుకునే సమయంలో ఓ జంట ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఆ అబ్బాయికి చదువు కలిసి రాదు.. అమ్మాయి మాత్రం ఉన్నత చదువుల కోసం సిటీకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె లైఫ్ లో ఏమి జరిగింది.. మొదటి లవ్ నెగ్గిందా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ముక్కోణపు ప్రేమకథగా ముగ్గురి జీవితాల్లో జరిగే ప్రేమ కథని ఇందులో చూపించారు. యువత ఈ సినిమాకి కనెక్ట్ అవుతారని, ఆనంద్, వైష్ణవి బాగా చేశారని చెప్తున్నారు.
Next Story