దొరసాని నిజంగా దొరసానమ్మే
రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు ఇప్పుడు డాక్టర్స్ మాత్రమే కాదు… హీరోయిన్స్ కూడా అయ్యారు. పెద్ద కూతురు శివాని అడివి శేష్ తో కలిసి 2 స్టేట్స్ రీమేక్ [more]
రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు ఇప్పుడు డాక్టర్స్ మాత్రమే కాదు… హీరోయిన్స్ కూడా అయ్యారు. పెద్ద కూతురు శివాని అడివి శేష్ తో కలిసి 2 స్టేట్స్ రీమేక్ [more]
రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు ఇప్పుడు డాక్టర్స్ మాత్రమే కాదు… హీరోయిన్స్ కూడా అయ్యారు. పెద్ద కూతురు శివాని అడివి శేష్ తో కలిసి 2 స్టేట్స్ రీమేక్ లో నటిస్తుండగా…. అనివార్య కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది ఇక రెండో కూతురు శివాత్మిక నటించిన దొరసాని సినిమా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఈ సినిమాతోనే హీరోగా టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం దొరసాని టీం ప్రమోషన్స్ లో దొరసాని సినిమా మీద ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఆసక్తిని క్రియేట్ చేసే పనిలో ఉంది. హీరోయిన్ శివాత్మిక కూడా మీడియా కి ఇంటర్వూస్ అవి ఇస్తూ హడావిడి చేస్తుంది.
అయితే డెబ్యూ హీరోయిన్ గా రాబోతున్న శివాత్మిక మీడియా కి ఇంటర్వ్యూలు గట్రా ఇస్తూ మంచి హుషారుగా ఉంది. ఇక పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా మీడియా దగ్గర ఒళ్లుదగ్గరపెట్టుని..వ్యవహరిస్తే సదరు కుర్ర హీరోయిన్ మాత్రం మీడియా ఫోటో గ్రాఫేర్స్ ఫొటోస్ తీస్తుంటే.. నాలుగైదు ఫొటోస్ తియ్యగానే.. ఇక చాలు అన్నట్టుగా అక్కడనుండి వెళ్లిపోవడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. మరి ఎంత హీరో కూతురైనా.. అలా యాటిట్యూడ్ చూపించడం అనేది కర్రెక్ట్ కాదనే విషయం అమ్మడుకి త్వరలోనే అర్ధమయినా.. ప్రస్తుతం అయితే ఆమె మీడియా కి అడ్డంగా దొరికిపోయింది. ఎంత టాప్ హీరోయిన్స్ అయినా.. ఫోటో గ్రాఫేర్స్ ఫొటోస్ తీస్తుంటే… ఇష్టమున్నా లేకపోయినా… స్మైల్ ఫేస్ తో 100 నుండి 200 ఫొటోస్ దిగుతారు. మరి ఈ కుర్ర హీరోయిన్ నటించిన మొదటి సినిమా ఇంకా థియేటర్స్ లోకి రాకముందే.. ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది అంటూ మీడియా మిత్రులు మాట్లాడుకోవడం చర్చనీయాంశం అయ్యింది. మరి ఇదంతా చూస్తుంటే… శివాత్మిక సినిమాలో దొరసానిగా కాస్త లెవెల్ చూపించినట్లుగా…. ఇప్పుడు మీడియా ముందు కూడా లెవెల్ చూపించడం చూస్తుంటే… ఈ దొరసాని నిజంగా దొరసానమ్మే అన్నట్టుగా లేదు.