Mon Dec 23 2024 14:35:22 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ బాబుపై ఆసక్తికర కామెంట్లు చేసిన ఆనంద్ మహీంద్రా
బ్యాంకులకు బడా బాబులు వేల కోట్ల రూపాయలు ఎగ్గొడుతూ ఉంటే.. మిడిల్ క్లాస్, సామాన్య జనం ఎంతగా ప్రభావితం అవుతున్నారో చూపించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే..! బ్యాంకింగ్ రంగంలో చోటు చేసుకున్న మోసాలకు సంబంధించి ఈ సినిమాలో చూపించారు. బ్యాంకులకు బడా బాబులు వేల కోట్ల రూపాయలు ఎగ్గొడుతూ ఉంటే.. మిడిల్ క్లాస్, సామాన్య జనం ఎంతగా ప్రభావితం అవుతున్నారో చూపించారు. ఈ సినిమాను ఎంతో మంది ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా సినిమా గురించి స్పందించారు.
తన ట్వీట్లో, జావాపై మహేష్ బాబు వెళ్లడం గురించి ప్రస్తావించారు మహీంద్రా. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు జావా బైక్ పై తిరుగుతూ ఉంటారు. సర్కారు వారా పాట సినిమాలో.. సెకండాఫ్‌లో మహేష్ ఈ బైక్ నడుపుతూ కనిపిస్తాడు. సినిమాలో వైజాగ్ వచ్చిన మహేష్ జావా బైక్‌పై తిరుగుతూ మనకు కనిపిస్తాడు. జావా మోటార్‌సైకిల్ నిజానికి మహీంద్రా & మహీంద్రా బ్రాండ్ కు చెందినది. దాదాపు 44 ఏళ్ల తర్వాత ఈ బైక్ భారత్ లో తిరిగి లాంచ్ చేయబడింది. ఇప్పుడు జావా మోటార్‌సైకిళ్లు మహీంద్రా & మహీంద్రా కంపెనీకి అనుబంధంగా ఉన్న క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అమ్మకాలు జరుగుతున్నాయి
ఆనంద్ మహీంద్రా తన ట్వీట్లో 'మహేష్ బాబు-జావా అద్భుతమైన కాంబినేషన్‌ని చూడకుండా ఎలా ఉండగలను? ప్రస్తుతం నేను న్యూయార్క్‌లో ఉన్నాను. త్వరలో న్యూజెర్సీకి వెళతాను.. అక్కడ సినిమా చూస్తాను.' అని చెప్పుకొచ్చారు.(How can I miss watching the unbeatable combination of @urstrulyMahesh and Jawa? I'm in New York & will go out to New Jersey where it's being screened… #SarkaruVaariPaata, #JawaMaroon) ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్‌కు ఫ్యాన్స్ నుంచి లైక్‌లు, రీట్వీట్స్ వస్తున్నాయి. అది సార్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ ను అభిమానులు స్క్రీన్ షాట్ తీసుకుని మరీ స్టేటస్ గా పెట్టుకుంటూ ఉన్నారు.
News Summary - mahesh babu riding jawa bike in sarkaru vari pata movie
Next Story