Mon Dec 23 2024 07:25:22 GMT+0000 (Coordinated Universal Time)
ఆ సినిమా చాలా బాగుందంటున్నారు.. ఎక్కడ చూడొచ్చంటే?
వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీలలో పలు సినిమాలు సందడి చేస్తూ
వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీలలో పలు సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సినిమాలు థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి. అందుకు పలు కారణాలు ఉంటాయనుకోండి. తాజాగా ఓ సినిమా గురించి పలువురు చర్చిస్తూ ఉన్నారు. సినిమా బాగుందని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇంతకూ ఆ సినిమా ఏమిటంటే 'ఖో గయే హమ్ కహాన్'.
లైగర్ భామ అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది నటించిన ఖో గయే హమ్ కహాన్ ప్రేక్షకుల నుండి గొప్ప ప్రశంసలను అందుకుంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా ముగ్గురి జీవితాలు ఎలా మారాయి అన్నదే ఈ సినిమా కథ. ఖో గయే హమ్ కహాన్ లో వారి జీవితాలు, వారి జీవితాలపై సోషల్ మీడియా ప్రభావాన్ని చూపించింది. బాలీవుడ్ క్లాసిక్ సినిమాలైన దిల్ చాహ్తా హై, జిందగీ నా మిలేగీ దొబారా నిర్మాతలే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. ఇందులో ఆదర్శ్ గౌరవ్, అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన తారాగణం. ఈ చిత్రం డిసెంబర్ 26 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి ప్రశంసలను అందుకుంటూ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో #1 ట్రెండింగ్లో ఉంది. అర్జున్ వరైన్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జోయా అక్తర్, రీమా కగ్టి, రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగులో అందుబాటులో ఉంది.
Next Story