సినిమాకన్నా టీవీకే నా మొదటి ప్రిఫరెన్స్!!
టివి లో జబర్దస్త్ యాంకర్ గా.. హాట్ యాంకర్ గా అందరి మనసులను దోచేసిన అనసూయ భరద్వాజ్ కి పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారంటే ఎవ్వరూ నమ్మరు. [more]
టివి లో జబర్దస్త్ యాంకర్ గా.. హాట్ యాంకర్ గా అందరి మనసులను దోచేసిన అనసూయ భరద్వాజ్ కి పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారంటే ఎవ్వరూ నమ్మరు. [more]
టివి లో జబర్దస్త్ యాంకర్ గా.. హాట్ యాంకర్ గా అందరి మనసులను దోచేసిన అనసూయ భరద్వాజ్ కి పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారంటే ఎవ్వరూ నమ్మరు. పిల్లలు పెరుగుతున్న అనసూయ లోని అందం, ఆకర్షణ ఏమాత్రం తగ్గడం లేదు. అయితే బుల్లితెర మీద ఇరగదేశస్తున్న అనసూయ అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటిస్తుంది. అందుకే అలీతో జాలిగా ప్రోగ్రాంలో అలీ గారు అనసూయ ని మీకు బుల్లితెర అంటే ఇష్టమా? లేదంటే సినిమా అంటే ఇష్ట్టమా? అనగానే అందరూ సినిమా అని చెబుతారు. కానీ అనసూయ నాకు మొదటి ప్రిఫరెన్స్ బుల్లితెరే. ఆ తర్వాతే సినిమా అంటుంది. డబ్బులు కోసం నేను సినిమాలు చెయ్యడం లేదు. కొంతమంది బుల్లితెర మీద అందాలతో, గ్లామర్ తో నెట్టుకొస్తున్నావ్ అని కామెంట్స్ చేస్తున్నారు కాబట్టే అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాను అని చెబుతుంది అనసూయ. ఇక తాను నటించిన సినిమాల్లోకెల్లా తనకి మంచి పేరు తెచ్చింది రంగస్థలంలోని రంగమ్మత్త పాత్ర అని చెబుతుంది.
నేను డబ్బు కోసం రంగమ్మత్త పాత్ర చెయ్యలేదని.. టివి నుండే తనకి బోలెడు వస్తుంది అని, లేదంటే వాళ్ళాయన ఇస్తాడని చెప్పిన అనసూయ.. సినిమాల్లో వేరే అనసూయని చూడాలి.. రంగమ్మత్త పాత్ర నాకు రాకముందు 20 మందిని సుకుమార్ ఆడిషన్స్ చేసారు. చివరికి ఆ పాత్ర నాకు దక్కింది అని చెబుతుంది.ఇక సినిమా ఇండస్ట్రీలో ఒకరకిి థాంక్స్ చెప్పాలి, ఒకరికి వార్నింగ్ ఇవ్వాలి అంటే.. దానికి అనసూయ నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి దర్శకనిర్మాతలకు థాంక్స్ చెప్పుకుంటాను. ముఖ్యంగా అడవి శేష్ కి థాంక్స్ చెబుతాను. ఇక యూట్యూబ్ కింద కామెంట్స్ చేసే వారికీ ఎప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఉంటాను అంటుంది. ఇక రెమ్యునరేషన్ కోసం సినిమా ఒప్పుకుంటారా? లేదంటే పాత్ర మంచిది అయితే ఒప్పుకుంటారా? అంటే ముఖ్యమైన పాత్రకే నా ఓటు అంటుంది అనసూయ.
- Tags
- anasuya