Mon Dec 23 2024 06:09:16 GMT+0000 (Coordinated Universal Time)
Anasuya : అనసూయకి 'ఆంటీ' అంటే ఎందుకు కోపం వస్తుందో తెలుసా..?
అనసూయకు 'ఆంటీ' అంటే ఎందుకు అంత కోపం వస్తుంది..? దాని వెనుక ఉన్న కారణం ఏంటి..? తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో..
Anasuya : టాలీవుడ్ యాక్ట్రెస్ అనసూయ ఇండస్ట్రీలో యాంకర్ గా, నటిగా మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. అలాగే సోషల్ మీడియా ట్రోల్స్ తో మరింత వైరల్ అవుతుంటుంది. యందొక విషయంలో అనసూయ ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది. అయితే ఈ ట్రోల్స్ చేసేటప్పుడు కొంతమంది నెటిజెన్స్.. ఆమెను 'ఆంటీ' అనే పదంతో కామెంట్స్ చేస్తుంటారు.
అలా ఆంటీ అనడం అనసూయకు నచ్చదు. ఒక సమయంలో ఆంటీ అనే వాళ్ళ పై పోలీస్ కేసు పెడతానంటూ కూడా కామెంట్స్ చేసింది. అసలు అనసూయకు 'ఆంటీ' అంటే ఎందుకు అంత కోపం వస్తుంది..? దాని వెనుక ఉన్న కారణం ఏంటి..? తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనసూయ తన కోపం వెనుక ఉన్న కారణాన్ని బయటపెట్టింది.
అనసూయ కామెంట్స్..
"నేను ఏదైనా పోస్టు పెడితే ఇంటిలో ఉన్న పిల్లల్ని చూసుకోండి ఆంటీ అంటూ కామెంట్స్ పెడతారు. ఆంటీ అనడం తప్పు కాదు. అనే విధానం తప్పు. చిన్న పిల్లలు ఆంటీ అంటే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే దానిలో క్యూట్నెస్ ఉంటుంది. కానీ నా వయసు వాళ్ళు కూడా ఆంటీ అని పిలిచే విధానంలో ఒక వల్గర్నెస్ ఉంటుంది. మల్లు ఆంటీ అనే పదాలతో మాట్లాడుతారు. ఇంగ్లీష్ లో ఆంటీ అనే పదం అమ్మ తరువాత స్థానంలో ఉండే పిన్నిని పిలిచే పదం.
నేను చిన్నప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళని ఆంటీ అని పిలిచాను. ఒకవేళ వాళ్ళకి అది ఇష్టం లేదని చెబితే నేను అనడం మానేస్తాను. మరి నాకు ఏదో విషయంలో అలా అనిపించుకోవడం ఇష్టం లేదని చెబుతున్నాను. అయినాసరి పదేపదే అంటూ ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఆ అనేవాళ్ళు నన్ను పేస్ టు పేస్ చూసి ఉండరు. భవిషత్తులో చూస్తారో కూడా తెలియదు.
అయినాసరి ఒక తెలియని అమ్మాయి పై ఇంతటి ద్వేషం ఎందుకు. అసలు వీళ్లంతా తమ పక్కన ఉన్న ఆడవాళ్ళని ఇంకెలా చూస్తారో. ఇలాంటి వాళ్లే భవిషత్తులో రేపిస్ట్ లు అవుతారు" అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Next Story