Thu Dec 19 2024 15:00:44 GMT+0000 (Coordinated Universal Time)
Anasuya : ఆర్య 2లో అనసూయ హీరోయిన్గా చేయాల్సిందట..
అల్లు అర్జున్‌కి హీరోయిన్గా నటించి ఎంట్రీ ఇవ్వాల్సిన అనసూయ.. టీవీ ఛానల్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.
Anasuya : టాలీవుడ్ యాక్ట్రెస్ అనసూయ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నటిగా స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తుంది. అలాగే తానే లీడ్ రోల్ చేస్తూ పలు చిత్రాల్లో కూడా నటిస్తుంది. అయితే అసలు అనసూయ ఇండస్ట్రీలోని ఎలా వచ్చింది..? ఏ సినిమాలో ఆమె మొదట నటించింది..? అనే విషయాలు చాలా మందికి తెలియదు. ఈ విషయాలు గురించి అనసూయ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆడియన్స్ కి తెలియజేసింది.
అనసూయ మొదటిసారి నటించిన సినిమా అంటే.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'నాగ' మూవీ. 2003 లో తెరకెక్కిన ఈ మూవీతోనే అనసూయ ఎంట్రీ ఇచ్చింది. కాలేజీ చదువుతున్న సమయంలో సినిమా చూడడానికి సికింద్రాబాద్ లోని ఒక థియేటర్ కి ఫ్రెండ్స్ తో కలిసి అనసూయ వెళ్లిందట. అయితే అక్కడ నాగ మూవీ షూటింగ్ జరుగుతుంది. మూవీ వాళ్ళకి జూనియర్ ఆర్టిస్టులు అవసరం అయ్యారు. దీంతో అనసూయని చేయమని అడిగారట.
అలా ఆ సినిమాలో ఎన్టీఆర్, సునీల్ తో కలిసి ఒక సీన్ లో నటించింది. ఇందుకోసం ఆమెకు రూ.450 డబ్బులు ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. అలాగే ప్రొడక్షన్ వాళ్ళకి ఇడ్లీ-వడ కూడా పెట్టారంటా. అనసూయ నటించడానికి ఒకే చెప్పడానికి సగం కారణం.. ఆ ఇడ్లీ-వడే అని చెప్పుకొచ్చింది. ఆ తరువాత Pixelloid గ్రాఫిక్ కంపెనీలో వర్క్ చేస్తున్న సమయంలో.. అనసూయకి చాలా సినిమా ఆఫర్లు వచ్చాయట.
మొదటిగా దర్శకుడు సుకుమార్ ఆఫర్ చేశాడట. అల్లు అర్జున్ ఆర్య 2 సినిమాలో అనసూయ నటించాల్సి ఉందట. కానీ ఆమె నో చెప్పిందట. ఆ సమయంలో పెళ్లి చేసుకునే పరిస్థితిలో ఉందట అనసూయ. ఇక నో చెప్పినందుకు సుకుమార్ ఇప్పటికి అనసూయని తిడుతుంటాడట. అయితే ఆ తరువాత రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో చాలా బలమైన పాత్రలు చేసింది అనుకోండి. ఇక ఆర్య 2 లో శ్రద్ధాదాస్ పోషించిన పాత్ర అని తెలుస్తుంది.
అల్లు అర్జున్ పక్కన సెకండ్ హీరోయిన్ గా నటించి పరిచయం కావాల్సిన అనసూయ.. టీవీ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా చేసి, ఆ తరువాత పలు టాక్ షోలు, ఫైనల్లీ జబరదాస్ వేదిక పైకి వచ్చి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో ఫుల్ బిజీ యాక్ట్రెస్ అయ్యిపోయింది.
Next Story