Sun Dec 22 2024 21:39:25 GMT+0000 (Coordinated Universal Time)
అనసూయ ట్వీట్ పై లైగర్ ఫ్యాన్స్ ఫైర్.. ముదురుతోన్న వివాదం
నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన లైగర్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ.. మధ్యాహ్నానికి నెగిటివ్ టాక్ రావడంతో ..
జబర్దస్త్ తో స్టార్ యాంకర్ గా ఎదిగిన అనసూయ భరద్వాజ్ - రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాపై అనసూయ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. అప్పట్లో అనసూయ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. అనసూయ - విజయ్ ఫ్యాన్స్ కి మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో జరిగింది. మళ్లీ ఇప్పుడు లైగర్ రిలీజ్ సందర్భంగా ఆ యుద్ధం మళ్లీ మొదలైంది.
నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన లైగర్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ.. మధ్యాహ్నానికి నెగిటివ్ టాక్ రావడంతో లైగర్ బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. లైగర్ కు డిజాస్టర్ టాక్ రావడంతో నెటిజన్లు పూరీ - విజయ్ లను మీమ్ లతో ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనసూయ కూడా 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా' అంటూ ట్వీట్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మా హీరోనే అంటావా అని అనసూయపై సోషల్ మీడియాలో మాటల యుద్ధం మొదలుపెట్టారు. బూతులతో ట్వీట్లు చేస్తుంటే.. అనసూయ వాటిని సునాయాసంగా తిప్పికొడుతోంది.
'మీరు నన్ను తిట్టిన తిట్లను మీ హీరోలకు పంపండి' 'ఛీ ఛీ ఇదేం చెత్త ..బాబోయ్ క్లీన్ చేసి చేసి విసుగొస్తుంది' అంటూ ఏడుపు ముఖం ఉన్న ఎమోజీని ఆమె కాసేపటికీ పోస్ట్ చేసింది. ట్రోల్స్ చేస్తున్న కొద్ది అనసూయ కూడా అదే రేంజ్లో రియాక్ట్ అవుతుంది. 'నన్ను తిడుతూ ట్వీట్లు చేస్తున్న వారందరి అకౌంట్స్ ను స్క్రీన్ షాట్స్ తీస్తున్నాను. నా వయసును దృష్టిలో పెట్టుకుని ఆంటీ అంటున్నారు. నా ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగుతున్నారు. మిమ్మల్ని ఊరికే వదలను మీ అందరిపై కేసు పెడతాను. నాతో పెట్టుకున్నందుకు మీరు ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది' అని అనసూయ ట్వీట్ చేసింది.
ఫ్యాన్స్ వెనుక దాక్కునే పిరికి వ్యక్తిని కాదు. ఫేక్ ఐడీస్తో ఇన్నేళ్లు తిడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా దూషిస్తున్నారు. నేను ప్రతి తిట్టుకి రీ ట్వీట్ చేస్తాను. ఎందుకంటే ఓ మహిళ తన గౌరవం కోసం పోరాటం చేస్తుందనేందుకు అదే రుజువు అని అనసూయ మరో ట్వీట్లో రాసింది.
Next Story